Home
Music

ఇక మీ ఐఫోన్‌ను వాక్‌మెన్‌గా మార్చేసుకోండి..?

By Super
Convert your iPhone to Walkman


ఆపిల్ ఐఫోన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ కాబడిన ఓ సరికొత్త ఆడియో గ్యాడ్జెట్ మార్కెట్లో హల్ చల్ చేస్తుంది. ఆపిల్ వినియోగదారులు ఇకపై తమ ఐఫోన్‌ను, వాక్‌మెన్ తరహాలో వాడుకోవచ్చు. ఈ ప్రక్రియను సాధ్యం చేస్తూ ‘అడ్మన్’ సంస్థ ప్రత్యేక వాక్‌మెన్ కేస్‌ను ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్‌కు డిజైన్ చేసింది.

వాక్‌మెన్ తరహాలో రూపుదిద్దుకున్న ‘అడ్మన్ కేస్’లో, ఐఫోన్‌ను క్యాసెట్ తరహాలో అమర్చాల్సి ఉంటుంది. ఆపై సంగీతాన్నీ మీకు నచ్చిన రీతిలో ఇయర్ ఫోన్ల ద్వారా ఆస్వాదించవచ్చు. కేస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పౌచ్ మీ బెల్ట్‌కు సౌకర్యవతంగా ఫిట్ అవుతుంది. రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లను కేస్‌లో నిక్షిప్తం చేశారు. ఈ స్పీకర్లు మన్నికైన సౌండ్‌ను విడుదల చేస్తాయి. కేస్ టాప్ భాగంలో ఏర్పాటు బటన్లు ద్వారా ప్లే, ఆన్, ఆఫ్, పాస్, వాల్యుమ్, ఫార్వర్డ్ వంటి అంశాలను నియంత్రించుకోవచ్చు.

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆకర్షణీయమైన డిజైన్,

- పటిష్టమైన పనితీరు,

- ఇంటిగ్రేటెడ్ స్పీకర్ వ్యవస్థ,

- స్టైలిష్ బటన్స్,

- హై క్వాలిటీ ABS ప్లాస్టిక్ పదార్ధాన్ని కేస్ నిర్మాణంలో ఉపయోగించారు,

- రీఛార్జబుల్ బ్యాటరీ,

- ఆటోమెటిక్ లాకింగ్ వ్యవస్థ,

- ధరలు రూ.6500, రూ.4500.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X