‘ఆపిల్’ తరహాలో ‘కౌన్ J3’!!

Posted By: Super

‘ఆపిల్’ తరహాలో ‘కౌన్ J3’!!

 

ఎంపీత్రీ మ్యూజిక్ ప్లేయర్ల రాకతో, ఆప్టికల్ డిస్క్ ప్లేయర్లు ప్రాచుర్యాన్ని కోల్పొయిన విషయం తెలిసిందే. ఆడ్వాన్సడ్ ఫీచర్లతో రోజుకో కొత్త పుంత తొక్కుతున్న ‘ఎంపీత్రీ ప్లేయర్స్ సెగ్మెంట్’ మానవుని జీవితంలోకి మరింత లోతుగా చొచ్చుకుపోయింది. మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీలో ‘కౌన్ ’(Cowon) సంస్థ ప్రాచుర్యం సంపాదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ లో విడుదలైన ‘కౌన్ J3’ మ్యూజిక్ ప్లేయర్ మార్కెట్లో క్రేజ్ దక్కించుకుంది.

‘ఆపిల్ ఐపోడ్ టచ్’ను తలపించే విధంగా ‘కౌన్ J3’ను రూపొందించినట్లు తెలుస్తోంది. 3.3 అంగుళాల టచ్ స్క్రీన్ సామర్ధ్యం, అత్యాధుని నావిగేషన్ టెక్నాలజీ, వీడియోలను వీక్షించేందుకు గాను సౌలభ్యతలను ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్లో కల్పించారు. మన్నికైన ‘గ్లోస్ ప్లాస్టిక్’ పదార్ధాన్ని ‘కౌన్ J3’ ప్లేయర్ నిర్మాణానికి ఉపయోగించారు. డివైజు బరువు కేవలం 20 గ్రాములు మాత్రమే.

ఎంపీత్రీ ప్లేయర్ ను టీవీ లేదా మానిటర్ కు అనుసంధానం చేసుకునే విధంగా ‘వీడియో అవుట్ పుట్’ పోర్టును మ్యూజిక్ ప్లేయర్ సైడ్ భాగంలో ఏర్పాటు చేసారు. అత్యాధునిక సౌండ్ వ్యవస్థను ఈ డివైజులో పొందుపరిచారు. మ్యూజిక్ ను కోరిన విధంగా ఎడ్జెస్ట్ చేసుకునేందుకు ‘ఫై బ్యాండ్ ఈక్వలైజర్’ను అమర్చారు. ఎఫ్ఎమ్ రేడియ్ రికార్డర్, వాయిస్ రికార్డర్, క్లాక్, క్యాలెండర్ తదితర ప్రత్యేక సౌలభ్యతలను ‘కౌన్ J3’లో పొందుపరిచారు. వివిధ మెమరీ సామర్ధ్యాలతో ఈ ఆడియో గ్యాడ్జెట్లు లభ్యమవుతున్నాయి. వీటి ధరలు రూ.13,500 నుంచి రూ.17,500 మధ్య ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot