సౌండ్ వింటే దిమ్మ తిరుగుద్ది!!

Posted By: Staff

 సౌండ్ వింటే దిమ్మ తిరుగుద్ది!!

 

దిమ్మ తిరిగే సౌండ్ టెక్నాలజీతో క్రియేటివ్ సౌండ్ బ్లాస్టర్ సంస్థ ‘3డి’ ఆల్పా హెడ్‌సెట్లను డిజైన్ చేసింది. ఈ సౌండ్ పరికరాల ద్వారా విడుదలయ్యే శబ్ధాలు శ్రోతను మైమరిపిస్తాయి. Xbox 360,PS3, PC, Mac వంటి గ్యాడ్జెట్‌లకు ప్రత్యేకించి ఈ

హెడ్‌సెట్‌ను డిజైన్ చేశారు. గేమింగ్ లవర్స్ అదేవిధంగా మ్యూజిక్ ప్రియులు ఈ హెడ్‌సెట్ల ద్వారా ఎనలేని సౌండ్ అనుభూతిని ఆస్వాదిస్తారు.

ఈ డివైజ్ నుంచి హై క్వాలిటీ ఆడియో విడుదలయ్యేందుకు గాను 40mm నియోడైమియమ్ డ్రైవర్లను ఏర్పాటు చేశారు. 3డి అనుభూతుల కోసం ‘THX TruStudio Pro’ సాఫ్ట్‌వేర్ సూట్‌ను ఈ హెడ్‌సెట్‌తో ప్రొవైడ్ చేస్తారు. 3.5mm ఆడియో ఆడాప్టర్, డ్యూయల్ మోడ్ యూఎస్బీ 2.0 ఆడాప్టర్ సౌలభ్యతతో ఈ సూట్‌ను ఉపయోగించుకోవచ్చు. ధర 5,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot