ఈ సౌండ్ వింటే దిమ్మ తిరుగుతుంది!!

Posted By: Prashanth

ఈ సౌండ్ వింటే దిమ్మ తిరుగుతుంది!!

 

దిమ్మ తిరిగే ఫీచర్లు.. మనసును హుషారెత్తించే స్పెసిఫికేషన్లతో క్రియేటివ్ సౌండ్ బ్లాస్టర్ సంస్థ ‘3డి’ ఆల్పా హెడ్ సెట్లను డిజైన్ చేసింది. ఈ హెడ్‌సెట్ ద్వారా విడుదలయ్యే శబ్ధాలను శ్రోత సౌకర్యవంతమైన అనుభూతితో ఆస్వాదిస్తాడు. Xbox 360, PS3, PC, Mac వంటి గ్యాడ్జెట్లకు ప్రత్యేకంగా ఆ ఆడియో డివైజ్‌లను డిజైన్ చేశారు. గేమింగ్ లవర్స్ అదేవిధంగా మ్యూజిక్ ప్రియులు ఈ హెడ్‌సెట్ల ద్వారా ఎనలేని అనుభూతిని పొందుతారు.

హెడ్‌సెట్ల నుంచి హై క్వాలిటీ ఆడియో విడుదలయ్యేందుకు గాను 40mm నియోడైమియమ్ డ్రైవర్లను సిస్టంలో నిక్షిప్తం చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మెరుగుపరిచేందుకు గాను ‘THX TruStudio Pro’ సాఫ్ట్‌వేర్ సూట్‌ను ప్రొవైడ్ చేశారు. 3.5mm ఆడియో ఆడాప్టర్, డ్యూయల్ మోడ్ యూఎస్బీ 2.0 ఆడాప్టర్ సౌలభ్యతతో ఈ సూట్‌ను ఉపయోగించుకోవచ్చు. ‘3డి’ సౌండ్ అనుభూతులను ఈ సాప్ట్‌వేర్ ద్వారా మన్నికైన కోణంలో ఆస్వాదించవచ్చు.

‘3డి’ ఆల్పా హెడ్ సెట్ ముఖ్య ఫీచర్లు:

డ్యూయల్ మోడ్, THX TruStudio Pro టెక్నాలజీ, టచ్‌స్ర్కీన్ కంట్రోల్స్, సర్వోత్తమమైన ఆడియో సెట్టింగ్స్, గేమింగ్ వాయిస్, ఎఫర్ట్‌లెస్ కమ్యూనికేషన్, డిటాచ్‌బుల్ మైక్రో ఫోన్, ఇన్-లైన్ వాల్యుమ్ కంట్రోల్, యూఎస్బీ ఆడాప్టర్, క్విక్‌స్టార్ట్ గైడ్, కస్టమ్ గ్రాఫిక్ ఈక్వలైజర్, యూజర్ గైడ్ సాఫ్ట్‌వేర్, నాయిస్ క్యాన్సిలింగ్ కండెన్సర్, ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20Hz నుంచి 20KHz వరకు. ధర రూ.5,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting