క్రియేటివ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్!!!

Posted By: Prashanth

క్రియేటివ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్!!!

 

హెడ్‌ఫోన్ అంటే తెలియని మ్యూజిక్ ప్రేమికుడు ఉండడు. ఆధునిక మానవుని దైనందని క్యారకలాపాల్లో ఓ భాగమైన సంగీతాన్ని రకరకాల సాధానాల ద్వారా అనేక సందర్భాల్లో ఆస్వాదిస్తున్నాం. వాక్‌మెన్ల ఆవిర్భావం నుంచి సుపరిచితమైన హెడ్ ఫోన్స్ క్రమం తమ పరిధిని విస్తిరించుకున్నాయి.

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో కొంత ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ దూసుకుపోతున్న క్రియేటివ్ గ్లోబల్ సంస్థ (Creative is a global company) ఆధునిక వైర్‌లెస్ పరిజ్ఞానంతో WP సిరీస్ హెడ్‌ఫోన్లను డిజైన్ చేసింది.

క్రియేటివ్ WP-300, క్రియేటివ్ WP-450, Creative WP-250 వేరియంట్లలో విడుదలైన ఈ హెడ్ ఫోన్ సిస్టం ఫీచర్లు క్లుప్తంగా:

క్రియేటివ్ WP-300:

- apt-X codec వైర్‌లెస్ వ్యవస్థను ఈ సిస్టంలో నిక్షిప్తం చేశారు.

- బ్లూటూత్ apt-X టెక్నాలజీ,

- 10 మీటర్ల సాంధ్రత,

- బ్లూటూత్ మొబైల్ డివైజులతో పాటు స్మార్ట్ ఫోన్, నోట్ బుక్, నెట్ బుక్, ఐప్యాడ్, ఐఫోన్ మరియు టాబ్లెట్ పీసీలకు ఈ హెడ్ ఫోన్‌ను జత చేసుకోవచ్చు.

- హెడ్‌ఫోన్ ఇయర్‌కప్‌లను సౌకర్యవంతంగా డిజైన్ చేశారు.

- ట్రాక్ ఛేంజ్, ఎడ్జస్ట్ వాల్యుమ్, ఆన్, ఆఫ్‌లకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను హెడ్ ఫోన్లలో ఏర్పాటు చేశారు.

- ధర రూ.4,000

క్రియేటివ్ WP-450:

- ఆధునిక సౌండ్ వ్యవస్థను ఈ హెడ్‌ఫోన్లలో నిక్షిప్తం చేశారు.

- బ్యాటరీ టాక్ టైమ్ 8 గంటలు,

- యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఛార్జ్ చేసుకునే సౌలభ్యత,

క్రియేటివ్ WP-250:

- సృజనాత్మకమైన డిజైన్‌తో ఈ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేశారు.

- నిక్షిప్తం చేసిన హైటెక్ పీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- నాయిస్ సప్రెషన్ టెక్నాలజి అంతారాయంలేని ఆడియోను నిరంతరాయంగా అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot