ఆపిల్ ఐపాడ్ లాంటి మరో అద్భుతం..!!

Posted By: Staff

ఆపిల్ ఐపాడ్ లాంటి మరో అద్భుతం..!!


‘‘ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఐపాడ్లు వేడి వేడి మిర్చీ బజ్జీల మాదిరి అమ్ముడైన విషయం తెలిసందే. ఈ సెన్సేషనల్ బ్రాండ్ కోవలోనే ‘క్రియేటివ్ టెక్నాలజీ సంస్థ’ అధ్భుతమైన మీడియా ఫ్లేయర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మ్యూజిక్ పరికరాల తయారీలో ఇప్పటికే పలు అద్భుతాలకు కేంద్ర బింధువుగా నిలిచిన ఈ సింగపూర్ సంస్థ ‘జెన్ X-Fi3’ మీడియా ప్లేయర్ విడుదలతో మరో సంచలనానికి తెరలేపనుంది.. సంగీత ప్రపంచంలో మునిగితేలే యువతకు ఈ పరికరం ఓ చక్కటి నేస్తం..’’

జెన్ X-Fi3 మీడియా ప్లేయర్ ఫీచర్లు క్లుప్తంగా: 2 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం గల ఎల్‌సీడీ స్క్రీన్ 640 x 480 పిక్సల్‌తో మెరుగైన విజువల్ అనూభూతిని కలిగిస్తుంది. మెమరీ సామర్థ్యానికి సంబంధించి 8జీబీ, 16 జీబీ వేరియంట్లలో ఈ పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు. మైక్రో ఎస్‌డి స్లాట్ విధానం ద్వారా జీబీని 32కు వృద్ధి చేసుకోవచ్చు.

ఈ ప్లేయర్‌లో ఎఫ్ఎమ్ రేడియో వెసులబాటు మరో ఆకర్షణ. ఈ పరికరంతో అదనంగా హెడ్‌సెట్‌ను పొందవచ్చు. ఇంటిగ్రేటడ్ స్పీకర్స్, ఆలార్మింగ్ ఆడిబులిటీ, నాణ్యమైన సౌండ్ పరిజ్ఞానం వంటి అంశాలు శ్రోతకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతిని అందిస్తాయి. మైక్రో ఫోన్ సౌలభ్యత ద్వారా వాయిస్‌లను రికార్డు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 2.1v బ్లూటూత్ వ్యవస్థ ద్వారా ఇతర మ్యూజిక్ ఫైళ్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

గ్యాడ్జెట్లో ప్రత్యేకంగా పొందుపరిచిన క్రియేటివ్ X-Fi క్రిస్టలైజర్ వ్యవస్థ ఆడియో ఫైల్ సౌండ్ నాణ్యతను మరింత పెంచుతుంది. WMV9, MPEG4-SP, and AVI (DivX4/5, XviD) వంటి వీడియో ఫార్మాట్లు ఈ ప్లేయర్‌లో ఉపకరిస్తాయి. పొందుపరిచిన flac, Audible 4 and WAV, Mp3 and WMA వంటి ఆడయో ప్లేయర్ వ్యవస్థలు సమర్థవంతమైన పనితీరును ప్రదర్శిస్తాయి.

బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. చార్జింగ్ స్టాండ్ బై ద్వారా 20 గంటల పాటు నిరంతరాయంగా మ్యూజిక్ వినవచ్చు. 5 గంటల పాటు నిరంతరాయంగా వీడియోలను తిలకించవచ్చు. వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ ప్లేయర్ల ధరలు రూ.45000 నుంచి మొదలవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting