‘ఓలాజిక్’ వినూత్న ఆవిష్కరణ డిస్క్ జాకి రోబోట్!!

Posted By: Staff

‘ఓలాజిక్’ వినూత్న ఆవిష్కరణ డిస్క్ జాకి రోబోట్!!


"ఆ మరమనిషి పాడటం, ఆడటం మాత్రమే కాదు ఎదుటి వారితో బ్రేక్ డ్యాన్సులు కూడా చేయిస్తాడు. ఇటువంటి ఆవిష్కరణలను చూస్తానని మనిషి ఏనాడు ఊహించి ఉండడు. నమ్మశక్యం కాని నిజాలను మనిషి నమ్మక తప్పటం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘మ్యూజిక్’ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ఓలాజిక్ (OLogic), ఆటోమెటడ్ మ్యూజిక్ పర్సనాలటీ (ఎఎమ్‌పీ) పేరుతో డిస్క్ జాకీ (DJ) రోబోట్‌ను రూపొందించింది."

క్లుప్తంగా ‘డిజే రోబోట్’ ఫీచర్లు...:

- ఆటోమెటిక్ మ్యూజిక్ పర్సనాలటీతో పనిచేసే ఈ రోబోట్‌ను స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.

- అమర్చిన రెండు చక్రాల సాయంతో ఈ రోబోట్‌ను ఏ గదిలోకైనా మార్చుకోవచ్చు.

- పటిష్టమైన ఆడియో వ్యవస్థ‌తో పాటు నాణ్యమైన స్పీకర్లను ఈ రోబోలో ప్రవేశపెట్టారు.

- 73CMల పొడవు ఉండే AMP రోబో మ్యూజిక్‌కు అనుగుణంగా కాంతులను విరజిమ్ముతుంది.

- రోబో చేతుల్లో అనుసంధానించిన ఆడియో కంట్రోలింగ్ వ్యవస్థను రిమోట్ కంట్రోల్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు.

- కేవలం స్మార్ట్ ఫోన్లనే కాకుండా 12 watt amp సామర్ధ్యం కలిగిన మ్యూజిక్ ప్లేయర్లను ఈ రోబోకు అనుసంధానం చేసుకోవచ్చు.

- డిజే (DJ) వాతవరణాన్ని ఈ ఎఎమ్‌పీ రోబోతో, మీ రూమ్‌లోనే పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు.

- ప్రస్తుతం యూఎస్, యూకె మార్కెట్లలో లభ్యమవుతున్న ఈ డీజే రోబోలు త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టునున్నాయి. అత్యాధునిక హంగులతో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈరోబో ధర రూ.33750 ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting