వెలుగుల పండక్కి..కొత్త ‘వస్తువు’ కొంటున్నారా..?

Posted By: Staff

వెలుగుల పండక్కి..కొత్త ‘వస్తువు’ కొంటున్నారా..?

వెలుగుల పండుగ ‘దీపావళీ’ఇంకొద్ది రోజుల్లో ఇంటి గడపు తొక్కనుంది.., ఇంటిల్లి పాదికి సుఖసంతోషాలను పంచే ఈ పండుగ సంబరాలను ధూమ్ దామ్ గా జరుపుకుంటారు. వ్యాపార వర్గాలకు ఈ పండుగు లాభసాటి భేరమే. పండుగ ఆఫర్ల నేపధ్యంలో అమ్మకాలు జోరు పండుగకు వారం ముందు నుంచే ఊపందుకుంటుంది. పండుగ దినాలను శుభసూచికంగా భావించే భారతీయులు సాంకేతిక మరియు ఎలక్ట్ర్రానిక్ వస్తువులతో పాటు ఇతర గృహోపరకరణాలను కొనుగోలు చేస్తుంటారు.

వినియోగదారుల అభిరుచులతో పాటు నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని పలు బ్రాండ్లు ‘ఆకర్ష్’మంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ‘దీపావళి ధమాకా’, ‘దివాలీ బోనాంజ’, ‘పండుగ డిస్కౌంట్ సేల్స్’అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. పలు మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు, పెద్ద పెద్ద రిటైల్ మర్చెంట్లు పండుగ ఆఫర్లంటూ ‘లక్కి డ్రా’ స్కీమ్ లను ఇప్పటికే ప్రవేశపెట్టాయి. పండగ పుణ్యమా అంటూ... ‘కొత్త టీవీ’కొనుక్కోవాలన్న ఇంటావిడ కల నిజమవటంతో పాటు ‘కొత్త బైక్’ కొనుక్కోవాలన్న కొత్త అల్లుడి మోజు తీరిపోతుంది.

కొత్త వస్తువులు కోనుగోలు విషయంలో జాగ్రత్త వహించటం మంచింది. డబ్బులు కాస్తంత ఎక్కువ ఖర్చుపెట్టినా మన్నికైన వస్తువులను ఎంచుకోండి. కమీషన్ల కోసం ‘సేల్స్ పర్సన్లు’ చేప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి. మన్నికైన వస్తువు కో్సం పది షాపులు తిరిగటం తప్పేంకాదు. వస్తువు కొనే ముందు దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు వారంటీ అంశాలను క్లుప్తంగా తెలుసుకోండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే విధంగా డీలర్ తో ఒప్పందం కుదుర్చుకోండి. టెక్ సంస్కృతి అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లో వస్తుంది. కొత్త వస్తువును కోనుగోలు చేసే విషయంలో ముందుచూపు తప్పనసరి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot