క్వాలిటీ వినోదం కోసం.. ఇలా ట్రై చేయండి!!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల సంస్క్ళతి విస్త్ళతమవుతున్న నేపధ్యంలో వీటికి అనుసంధానించుకునేందుకు రకరకాల మ్యూజిక్ గాడ్జెట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ ‘డాక్టర్ డ్రీ’ అత్యాధునిక మ్యూజిక్ సాంకేతికతతో బీట్‌బాక్స్‌ను డిజైన్ చేసింది. బ్లాక్ మరియు వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఆడియో స్పీకర్ లభ్యంకానుంది. క్రిస్టల్ క్లారిటీ సౌండ్‌ను ఈ డివైజ్ ఉత్పత్తి చేస్తుంది. కల్పించిన మెరుగైన ధ్వని వ్యవస్థ క్లబ్ తరహా అనుభూతికిలోను చేస్తుంది. పొందుపరిచిన ఆటోమెటిక్ వాల్యుమ్ కంట్రోల్ వ్యవస్థ సౌండ్ స్థాయిని వాతావరణాన్ని బట్టి పెంచటం లేక తగ్గించటం జరుగుతుంది. స్పీకర్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ డాక్ వ్యవస్థ ఐపాడ్, ఐఫోన్ ఇతర స్మార్ట్ ఫోన్‌లను సురక్షితంగా ఫిట్ అయ్యేలా చేస్తుంది. ఈ పోర్టబుల్ స్పీకర్ ప్రయాణ ఇతర పార్టీ సమాయాల్లో అలసట రాని వినోదాన్ని పంచుతుంది. సంవత్సరం వారంటీతో లభ్యం కానున్న ‘డిఆర్ డ్రీ బీట్ బాక్స్’ ఇండియన్ మార్కెట్ ధర రూ.20,000.


Click it and Unblock the Notifications








