పిట్ట కొంచెం కూత ఘనం!

Posted By: Staff

పిట్ట కొంచెం కూత ఘనం!

ఆడియో పరికరాలు తయారీ సంస్థ ఇమాటిక్ (Ematic)పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను రూపొందించింది. దీని పేరు ‘ఇమాటిక్ ఎస్కార్ట్ క్లిప్’.ఆకర్షణీమైన శైలిలో డిజైన్ కాబడిన ఈ ట్రెండీ మ్యూజిక్ ప్లేయర్ ఆధునిక స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. రూ. 1100లకే అందుబాటులోకి రానున్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్ ఫీచర్లు క్లుప్తంగా…

1.8 అంగుళాల కలర్ స్ర్కీన్ డిస్‌ప్లే,

5 మెగా పిక్సల్ కెమెరా,

4జీబి మెమరీ,

మైక్రో‌ఎస్డీ స్లాట్ ద్వార మెమరీని పెంచుకునే సౌలభ్యత,

ఎఫ్ఎమ్ రేడియో,

ఇ-బుక్ రీడర్.

ఏ విధమైన హెడ్‌ఫోన్‌కైనా ఈ ప్లేయర్‌ను జత చేసుకోవచ్చు. తక్కువ బరువును కలిగి ఉండే ప్లేయర్‌ను ప్రయాణ సందర్భాల్లో సులువుగా క్యారీ చెయ్యవచ్చు. రెడ్, పింక్, పర్పిల్ కలర్ వేరియంట్‍‌లలో లభ్యం కానుంది. పొందుపరిచిన ఇ-బుక్ రీడర్ అప్లికేషన్ ద్వారా ఇ -పుస్తకాలను చదువుకోవచ్చు. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot