‘ఎనర్జీ ఎంపీ4 ప్లేయర్’తో ఫీల్‌ గుడ్ మ్యూజిక్‌ను ఆస్వాదించండి..!!

Posted By: Super

‘ఎనర్జీ ఎంపీ4 ప్లేయర్’తో ఫీల్‌ గుడ్ మ్యూజిక్‌ను ఆస్వాదించండి..!!

‘ఎంపీ4’ ప్లేయర్లను సమర్ధవంతంగా రూపొందించటంలో సఫలీకృతమైన ‘ఎనర్జీ సిస్టమ్స్’ (Energy systems) అత్యాధునిక సౌండ్ పరిజ్ఞానంతో రెండు ఎంపీ4 ప్లేయర్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అత్యాధునిక డీజే (DJ) హెడ్ సెట్లతో ఈ ప్లేయర్లు విడుదల కానున్నాయి.

‘ఎనర్జీ 2204 డీజే వైలెట్ డ్రీమ్’, ‘ఎనర్జీ 2204 డీజే రూబీ రెడ్’ వేరియంట్లలో రూపుదిద్దుకుంటున్న మ్యూజిక్ ప్లేయర్లు వైలెట్ మరియు రెడ్ కలర్లలో లభ్యం కానున్నాయి.

ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేయుబడ్డ ఈ మ్యూజిక్ పరికరాలు, కేవలం 24 గ్రాముల బరువుతో, 8mm మందపు ధారుడ్యాన్ని కలిగి ఉంటాయి. MP3, WMA ఫార్మాట్లకు సహకరిస్తాయి. MPEG4 వీడియోలను ఈ పరికరాల్లో వీక్షించవచ్చు.

గ్యాడ్జెట్లలో పొందుపరిచిన 4జీబీ మెమరీ సామర్ధ్యంతో కోరుకున్న పాటలను స్టార్ చేసుకోవచ్చు. ‘ఎఫ్ఎమ్’ రేడియ్ వెసలబాటు ఈ ప్లేయర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

యూనిట్‌లో భాగంగా రూపొందించిన ‘హెడ్‌ఫోన్లు’ నాణ్యమైన స్టీరియో ఫోనిక్ సౌండ్ అనుభూతులను శ్రోతకు కలిగిస్తాయి. ‘ఇన్-లైన్’ వాల్యుమ్ కంట్రోల్ వ్యవస్థను హెడ్‌సెట్లలో ఏర్పాటు చేశారు. రీఛార్జ్‌బుల్ లయోన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఎనర్జీ సిస్టమ్స్ 22 సరీస్‌లో విడుదల కాబోతున్న ఈ ఎంపీ4 మ్యూజిక్ ప్లేయర్ల ధరలకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot