'హెడ్‌సెట్‌' తో మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి

Posted By: Prashanth

'హెడ్‌సెట్‌' తో మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి

 

డైలీ దైనందిన జీవితంలో మొబైల్ యూజర్స్ కోసం 'ప్లాన్‌ట్రానిక్స్' కొత్త కొత్త వెరైటీ హెచ్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. 'ప్లాన్‌ట్రానిక్స్' ఇప్పటి వరకు విడుదల చేసిన బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌కి యూజర్స్ నుండి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. చిన్న చిన్న మొబైల్ తయారీ దారుల బిజినెస్ రిక్వైర్ మెంట్స్‌కి 'ప్లాన్‌ట్రానిక్స్' హెడ్ సెట్స్ సరిపోయే విధంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

'ప్లాన్‌ట్రానిక్స్' కంపెనీ ఇటీవల కొత్తగా సింగపూర్‌లో 'ఎమ్155 బ్లూటూత్ హెడ్‌సెట్' విడుదల చేయడం జరిగింది. ఈ హెడ్ సెట్‌ని ప్రత్యేకంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కోసం రూపొందించడం జరిగింది. ప్లాన్‌ట్రానిక్స్ ఎమ్155 బ్లూటూత్ హెడ్‌సెట్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

* Small and compact

* Voice recognition enabled

* Micro USB charging

* Good voice clarity

ఇప్పటి వరకు ప్లాన్‌ట్రానిక్స్ విడుదల చేసిన హెడ్ సెట్స్‌లలో ప్లాన్‌ట్రానిక్స్ ఎమ్155 బ్లూటూత్ హెడ్‌సెట్ అతి చిన్న హెడ్ సెట్ కావడం విశేషం. చూసేందుకు డివైజ్ చాలా సింపుల్‌గా ఉండడమే కాకుండా, యూజర్స్ కోసం రెండు కలర్స్‌(jet black, Artic white)లలో మార్కెట్లో లభ్యమవుతుంది. దీని బరువు 7 గ్రాములు.

ఈ హెడ్ సెట్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మైక్రో యుఎస్‌బి కనెక్టర్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ హెడ్ సెట్ టాక్ టైమ్ 5 గంటలు కాగా, స్టాండ్ బై టైమ్ 9 రోజులు. ఈ బ్లూటూత్‌లో 3.0 వర్సన్‌ని ఉపయోగించడం వల్ల యూజర్స్ యొక్క వాయిస్ చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఇందులో ఉన్న మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉన్న అప్లికేషన్స్‌ని ఉపయోగించుకొవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 3,000గా ఉండవచ్చునని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot