ట్రాఫిక్‌లో ఉన్నా క్లారిటీ మిస్ కాదు!!!

Posted By: Prashanth

ట్రాఫిక్‌లో ఉన్నా క్లారిటీ మిస్ కాదు!!!

 

హెడ్‌ఫోన్స్ అదేవిధంగా ఇయర్ ఫోన్స్ అంటే మ్యూజిక్ ప్రేమికులకు అమితమైన ఇష్టం. ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘క్రియేటివ్ టెక్నాలజీస్’(Creative Technologies) అనవసర శబ్ధాలను నిరోధించే అత్యాధునిక ఐసోలేషన్ ఇయర్ ఫోన్లను డిజైన్ చేసింది.

‘EP 600’, ‘EP 660’ మోడళ్లలో రూపుదిద్దుకున్న అత్యుత్తమ ఆడియో గ్యాడ్జెట్లు ‘నమ్మదగిన నాయిస్ క్యాన్సిలేషన్’ వ్యవస్థను కలిగి ఉంటాయి. ప్రయాణ ఇతర రద్ధీ సందర్భాల్లో సైతం సౌకర్యవంతమైన ఆడియోను శ్రోత రిసీవ్ చేసుకోగలుగుతాడు.

అన్ని వాతావరణాల్లో ‘EP’ సిరీస్ ఇయర్ ఫోన్లు సౌకర్యవంతంగా స్పందించే విధంగా అధునాతన నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీ మరియు బాస్ బూస్టింగ్ టెక్నాలజీలు దోహదపడతాయి. పటిష్టమైన ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం, శక్తివంతమైన డ్రైవర్స్ శ్రోతకు వినసొంపైన ఆడియోను అందిస్తాయి. ఏర్పాటు చేసిన ‘సాఫ్ట్ సిలికోన్ ఇయర్ బడ్స్’ చెవులకు సౌకర్యవంతంగా ఉంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot