పండుగల శోభతో మెరిసిపోతున్న ‘ఫిలిప్స్’!!

Posted By: Prashanth

పండుగల శోభతో మెరిసిపోతున్న ‘ఫిలిప్స్’!!

 

దశాబ్ధాల కాలంగా భారతీయులు విశ్వసిస్తున్న బ్రాండ్ ‘ఫిలిప్స్’(Philips). మన్నికతో కూడిన ఎలక్ర్టానిక్ పరికరాలను ఉత్పత్తి చేయ్యటంలో ఈ బ్రాండ్ దిట్ట. పండుగ సీజన్ లలో ‘ఫిలిప్స్’ ఉత్పత్తులు అత్యధిక స్థాయిలో అమ్ముడవుతుంటాయి. ఈ వరుస పండుగల నేపధ్యంలో మార్కెట్ లలో ఫిలిప్స్ ఉత్పత్తులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పండుగల వేళ, మీ ఇంటి సుఖ సంతోషాలను పంచేందుకు మీ నమ్మకమైన బ్రాండ్ ఫిలిప్స్ సరికొత్త ‘3డి బ్లూ రే ప్లేయర్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ డివైజ్ ఫీచర్లు క్లుప్తంగా:

* ‘ఫిలిప్స్ BDP5200’ వేరియంట్ లో విడుదలైన 3డి బ్లూరే ప్లేయర్ బరువు 1.65 కిలోలు,

* కాంపోజిట్ వీడియో అవుట్ పుట్,

* డిజిటల్ ఆడియో అవుట్ పుట్,

* ప్లేయర్ ను హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్,

* యూఎస్బీ v2.0 పోర్ట్,

* ఇతర్ నెట్ పోర్ట్,

* SD/SDHC కార్డ్ స్లాట్,

* 148 MHz సామర్ద్యం గల D/A కన్వర్టర్,

* డాల్బీ ట్రూ హై డెఫినిషన్ పిక్షర్ క్వాలిటీ,

* డీటీఎస్ డిజిటల్ ఆడియో అవుట్ పుట్,

* DVD/DVD-R/RW వీడియో ఫార్మాట్ ప్లే బ్యాక్,

* CD-R/RW వీడియో ఫార్మాట్ ప్లే బ్యాక్,

* JPEG ఇమేజ్ సపోర్ట్,

* BD-ROM ప్లేబ్యాక్, BD-R/RE ప్లే బ్యాక్

* కావల్సిన పవర్ సామర్ధ్యం 220V-240V at 50-60 Hz,

రిమోట్ కంట్రోల్ ఆధారితంగా ప్లేయర్ ను నియంత్రించుకోవచ్చు. 1080 పిక్సల్ హై డెఫినిషన్ సామర్ధ్యం గల 3డీ ఫైళ్లు ఈ ప్లేయర్లో ఫ్లే అవుతాయి. ఇంటర్నెట్ వీడియో ప్లేబ్యాక్ ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.13,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot