ఇప్పుడు మ్యూజిక్ హుందాగా వినండి!!!
[caption id="attachment_3429" align="aligncenter" width="500" caption="First Klipsch headphone"]

ఆకర్షణీయమైన డిజైన్ ఈ హెడ్ ఫోన్స్ సొంతం. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఇయర్ కప్స్ రూపకల్పన, సున్నితమైన పదార్థాన్ని హెడ్ ఫోన్ల నిర్మాణంలో వినియోగించారు. ఈ హెడ్ ఫోన్లను ధరించి మ్యూజిక్ ను సౌకర్యవంతంగా గంటల తరబడి ఆస్వాదించవచ్చు. ఇన్ లైన్ మైక్రోఫోన్ వ్యవస్థను హెడ్ సెట్లో నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ మ్యానిపులేషన్ బటన్లను ఇయర్ కప్స్ పై భాగంలో ఏర్పాటు చేశారు. వీటిని సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు.
పొందుపరిచిన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్ధ బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తుంది. డివైజులో పొందుపరిచిన రిఛార్జ్ బుల్ బ్యాటరీ 45 గంటల బ్యాకప్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ 45 గంటలు మాత్రమే నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్ద పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో స్పేర్ బ్యాటరీని సిద్ధంగా ఉంచుకోవాలి. ధర రూ.15,000, మన్నికైన సౌండ్ వ్యవస్థతో కూడి హెడ్ ఫోన్ ను కోరుకునే వారికి ‘క్లిప్చ్ మోడ్ M40’ ఉపయుక్తంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








