న్యూ బ్యాలెన్స్ ‘ఫిట్ నెస్’ హెడ్ ఫోన్లు.. ఖచ్చితమైన మీ జిమ్ డేటా కోసం..!!

Posted By: Staff

న్యూ బ్యాలెన్స్ ‘ఫిట్ నెస్’ హెడ్ ఫోన్లు.. ఖచ్చితమైన మీ జిమ్ డేటా కోసం..!!


"మానవుని దైనందిన జీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. సాంకేతికత సాయం లేకుండా మనిషి ఏ పనికి పూనుకోవటం లేదు. టెక్ వినియోగాన్ని అంచనావేయటంలో సఫలీకృతమవుతున్న పలు సంస్థలు, ఆధునిక పరిజ్ఞానాన్ని మరింత చేరువచేస్తున్నాయి. ఈ కోవకే చెందిన మ్యూజిక్ పరికరాల తయారీదారు న్యూ బ్యాలెన్స్’ (New Balance), ఫిట్ నెస్ మ్యూజిక్ గ్యాడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ‘న్యూ బ్యాలెన్స్ NB639’వర్షన్ లో విడుదలైన మ్యూజిక్ హెడ్ ఫోన్ పరికరం వ్యాయామం చర్యల్లో పాల్గొనే వారికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది."

సురక్షితమైన అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ హెడ్ ఫోన్లను డిజైన్ చేశారు. ఈ హెడ్ ఫోన్లు ధరించి సౌకర్యవంతంగా వ్యాయామంలో పాల్గొన వచ్చు. పరికరంలో ఏర్పాటు చేసిన స్వీట్ ప్రూఫ్ వ్యవస్థ సుఖవంతమైన అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది.

హెడ్ ఫోన్ లో ఏర్పాటు చేసిన ‘క్రోనోగ్రాఫ్’(chronograph) వ్యవస్థ స్టాప్ వాచ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. అంటే మీ వ్యాయామాన్ని లెక్కింస్తుందన్నమాట. మరో వ్యవస్థ హార్ట్ రేట్ మానిటర్ (heart rate monitor), మీ గుండె పనితీరుకు సంబంధించి సమచారాన్ని ఎప్పటికప్పుడు మీ చెవిని పడేస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి మీ బొటను వేలును సెన్సార్ పై ఉంచాల్సి ఉంటుంది.

ఎంత దూరం పరిగెత్తారు..,. గుండె తాజా పరిస్ధితి ఏంటి.., ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి తదితర అంశాలకు సంబంధించి ఖచ్చితమైన డేటాను ఈ ఫిట్ నెస్ హెడ్ ఫోన్ ద్వారా మీరు పొందగలుగుతారు. ‘హార్ట్ పాల్’ ఆడ్వాన్సడ్ గ్రాఫిక్ సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఈ గ్యాడ్జెట్ లో పొందుపరిచారు. ‘న్యూ బ్యాలెన్స్ NB639’ హెడ్ ఫోన్ మార్కెట్ ధర రూ. 4,000 త్వరపడండి మరీ..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot