‘ఫ్లూయన్స్’ ఐఫోన్ సౌండ్ సిస్టమ్!!

Posted By: Staff

‘ఫ్లూయన్స్’ ఐఫోన్ సౌండ్ సిస్టమ్!!

వినియోగదారులకు లాభదాయకమైన వారంటీతో ‘ఫ్లూయన్స్’ స్పీకర్ తయారీ సంస్థ గ్యాడ్జెట్లను అందించనుంది. ‘ఫ్లూయన్స్ FiSDK500’ వర్షన్‌లో ఈ బ్రాండ్ ఐఫోన్ స్పీకర్ సిస్టమ్‌ను మార్కెట్లో విడుదలచేసింది. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించి 30 రోజుల సంతృప్తి గ్యారంటీ పధకాన్ని బ్రాండ్ ప్రవేశపెట్టంది. ఈ 30 రోజుల్లో స్పీకర్ సిస్టమ్ పనితీరు నచ్చకపోతే వినయోగదారుడు వస్తువును తిరిగిచ్చేసి, డబ్బులు వాపస్ తీసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 24 గంటల టోల్ ఫ్రీ కస్టమర్ సపోర్టు వ్యవస్థ బ్రాండ్ విశ్వసనీయతకు మరో నిదర్శనం.

క్లుప్తంగా ఫీచర్లు:

- ఐఫోన్ మరియు ఐప్యాడ్ పరికరాలకు ఈ స్పీకర్ వ్యవస్థను అనుసంధానం చేసుకోవచ్చు.

- హోమ్ ధియోటర్ అనుభూతికి లోనుచేసే ఈ ‘FiSDK500’ స్పీకర్ వ్యవస్థను అత్యాధునిక ఆడియో గ్రేడ్ వుడ్ క్యాబినెట్‌తో డిజైన్ చేశారు.

- స్పీకర్లలో ఏర్పాటు చేసిన రెండు ఫుల్ రేంజ్ ఊఫర్లతో పాటు అల్ట్రా హై ఎండ్ ట్వీటర్లు మన్నికైన బీటింగ్‌తో సౌండ్‌ను విడుదుల చేస్తాయి.

- 6.1 కిలోల బరువుతో రూపుదిద్దుకున్నఈ స్పీకర్ సిస్టమ్ 40 డెసిబల్స్ వాల్యూమ్ స్పెసిఫికేషన్ కలిగి ఉంటుంది.

- ఏర్పాటు చేసిన యాంఫ్లీఫయర్ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.

- స్పీకర్ సిస్టమ్ మార్కెట్లో రూ.9.000కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot