‘ప్లాటినమ్’ పోర్టుబల్ బ్లూటూత్ స్పీకర్లు., మన్నికైన రేంజ్‌‌లో!!

Posted By: Super

‘ప్లాటినమ్’ పోర్టుబల్ బ్లూటూత్ స్పీకర్లు., మన్నికైన రేంజ్‌‌లో!!

ఫ్రెండ్స్‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసే యూత్‌కు మరో పసందైన వార్త, సంగీత ప్రపంచంలో ఊర్రూతలూగించే సరికొత్త బ్లూటూత్ స్పీకర్లను ‘ప్లాటినమ్ సంస్ధ’ విడుదల చేసింది. బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ ప్లేయర్లకు ఈ స్పీకర్ సిస్టమ్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. వైర్ల ఆధారింతంగా పనిచేసే ‘నాన్ బ్లూటూత్ వర్షన్’ పోర్టుబుల్ స్పీకర్లను సైతం బ్రాండ్ విడుదల చేసింది.

పోర్టుబుల్ సైజులో డిజైన్ చేయబడ్డ ‘FoxLV2’ ప్లాటినమ్ బ్లూటూత్ స్పీకర్లను సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ స్పీకర్లలో అనుసంధానించిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 20 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ‘ఆడియో ఫైల్ కేబిలింగ్ టెక్నాలజీ’ని ఈ స్పీకర్లలో రూపొందించారు. కేబులింగ్ వ్యవస్థ బ్లూటూత్ సిగ్నల్స్‌కు వేగవంతంగా స్పందిస్తుంది.

ఆధునిక నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్లను ఈ స్పీకర్లలో ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ల సౌలభ్యతతో అంతరాయంలేని సంగీతాన్ని నిరవధికంగా వినవచ్చు. మైక్రో‌ఫోన్ వ్యవస్థను స్పీకర్ వ్యవస్థలో అనుసంధానించారు. ‘ఫోన్ కాల్స్’ చేసుకునే సందర్భంలో ఈ మైక్రోఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. కేవలం 9.5 ounceల బరవు కలిగి ఉండే ‘FoxLV2’ స్పీకర్లు అత్యాధునిక సౌండ్ ఫీచర్లను కలిగి ఉంటాయి.

స్పీకర్లలో ఏర్పాటు చేసిన ‘CSR apt-X’ సౌండ్ టెక్నాలజీ వ్యవస్థ వినసొంపైన ఆడియో అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది. బ్లాక్ ప్లాటినమ్ ఫినిష్‌తో డిజైన్ చేయుబడ్డ ఈ స్పీకర్లు నవంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి.

వీటి ధరలను పరిశీలిస్తే బ్లూటూత్ వర్షన్ ‘FoxLV2 ప్లాటినమ్ బ్లూటూత్ స్పీకర్ల’ ధర రూ.11,250, నాన్ బ్లూటూత్ వర్షన్ ‘FoxLV2 ప్లాటినమ్ బ్లూటూత్ స్పీకర్ల’ ధర రూ.8,300 ఉండోచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot