నవ్వులే నవ్వులు., ‘గేర్ 4 యాంగ్రీ బోర్డ్ స్పీకర్ల’తో!!

Posted By: Super

నవ్వులే నవ్వులు., ‘గేర్ 4 యాంగ్రీ బోర్డ్ స్పీకర్ల’తో!!

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘యాంగ్రీ బర్డ్స్’ డాకింగ్ స్పీకర్ సిస్టమ్‌లను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్పీకర్లపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఊపందుకున్నాయి. ‘యాంగ్రీ రెడ్ బర్డ్ స్పీకర్’, యాంగ్రీ బ్లాక్ బర్డ్ స్పీకర్, గ్రీన్ హెల్మట్ పిగ్ స్పీకర్ మోడళ్లలో ఈ సౌండ్ వ్యవస్థలు విడుదల కాబోతున్నాయి.

డాక్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ స్పీకర్లు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటాయి. ఆపిల్ ఐపాడ్, ఐప్యాడ్, ఐఫోన్ వంటి డివైజ్‌లతో పాటు ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు ఈ డాకింగ్ సౌండ్ సిస్టమ్‌లను అనుసంధానం చేసుకోవచ్చు.

- ‘యాంగ్రీ రెడ్ బర్డ్ గేర్ 4 స్పీకర్లు’ మన్నికైన ఆడియో ప్లేబ్యాక్ వ్యవస్థతో రూపుదిద్దుకున్నాయి. ఆపిల్ డివైజ్‌లతో పాటు ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు
ఈ స్పీకర్ వ్యవస్థను జత చేసుకోవచ్చు.

- మిలటరీ హెల్మెట్‌ డిజైన్‌తో రూపొందించబడ్డ ‘ఎవిల్ గ్రీన్ పిగ్ స్పీకర్లు’ క్లాసీ లుక్ కలిగి ఉంటాయి. ఆపిల్ ఐపాడ్ పరికరాలతో పాటు ఆపిల్ ఐఫోన్లకు ఈ స్పీకర్లను అనుసంధానం చేసుకోవచ్చు.

- ‘యాంగ్రీ కీబోర్డు స్పీకర్ల’ విషయానికొస్తే ఎక్స్‌క్లూజివ్‌గా ‘ఆపిల్ ఐప్యాడ్ స్పీకర్ల’ కోసమే రూపొందించారు.

- అత్యుత్తమ నాణ్యత గల 2.1 ఆడియో స్పీకర్ వ్యవస్థ, పవర్ ఆడాప్టర్, 3.5mm పోర్టు, లైన్‌ఇన్ కేబుల్స్‌ను ఈ స్పీకర్ల యూనిట్‌లో ఏర్పాటు చేశారు.
ఈ స్పీకర్ సెట్లు ‘1400 గ్రాముల’ బరువును కలిగి ఉంటాయి.

- ‘గేర్ 4’ వెబ్ సైట్లో పొందుపరిచిన సమాచారం మేరకు ‘రెడ్ యాంగ్రీ బర్డ్ స్పీకర్’ ధర రూ.4300, ‘గ్రీన్ హెల్మెట్ పిగ్ స్పీకర్’ ధర రూ. 5,800, ‘బ్లాక్ యాంగ్రీ బర్డ్ స్పీకర్’ ధర రూ.6,300గా నిర్థారించారు. ఆమెరికా, యూరప్ దేశాల్లో ఇంకొద్ది వారాల్లో ఈ స్పీకర్ సెట్లు విడుదల కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot