అదృష్టం ఉన్న వారికే.. ‘జనీలిక్’ దక్కుతుంది..!!

Posted By: Staff

అదృష్టం ఉన్న వారికే.. ‘జనీలిక్’ దక్కుతుంది..!!


‘‘నాణ్యమైన సంగీతాన్ని వినసొంపైన కోణంలో అందించే అద్భుత సంగీత పరికరాన్ని ఎవరు వదిలిపెట్టుకుంటారు చెప్పండి. ప్రస్తుతం ఇటువంటి చర్యే ఒకటి జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీ పరికరాల తయారీ సంస్ధగా పేరుగాంచిన ‘జనీలిక్’ (Genelec) వినూత్న స్పీకర్ సిస్ట్‌మ్‌ను లిమిటెడ్ ఎడిషన్లో ప్రవేశపెట్టింది. ఐరోపా మార్కెట్లో లభ్యమవుతున్న ఈ స్పీకర్లను రూ.20వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు.’’

- ‘6000A Tube’తో విడుదలైన స్పీకర్లను టీవీ, కంప్యూటర్ పరికరాలతో పాటు మ్యూజిక్ ప్లేయర్లకు అనుసంధానం చేసుకోవచ్చు. స్పీకర్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పోర్టులకు జాక్‌లను అనుసంధానించుకోవల్సి ఉంటుంది.

- 10W యాంప్లీఫ్లైయర్లను ఈ స్పీకర్ వ్యవస్థలో అనుసంధానించారు.

- రిమోట్ కంట్రోల్ ఆధారితంగా ఈ స్పీకర్ వ్యవస్థ పనిచేస్తుంది. స్పీకర్లలో పొందుపరిచిన ఆటోమెటిక్ సిగ్నల్ సెన్సింగ్ టెక్నాలజీ వ్యవస్థ స్పీకర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

- పొందుపరిచిన సౌండ్ డిఫ్యూషన్ టెక్నాలజీ నాణ్యమైన సంగీతాన్ని మీకు అందిస్తుంది.

- ప్రస్తుతం జపాన్‌లో అమ్మకాలు జరుపుకుంటున్న ఈ స్పీకర్లు లిమిటెడ్ ఎడిషన్ విధానంలో కేవలం వెయ్యి 6000A స్పీకర్ వ్యవస్థలను మాత్రమే ఐరోపా మార్కెట్‌కు తరలించారు. కావల్సినవారు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రూ.20,000 చెల్లించి ఈ అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting