ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం జీనియస్ స్పీకర్లు!!

Posted By: Staff

ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం జీనియస్ స్పీకర్లు!!

 

పర్సనల్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్ విభాగాల పై ప్రభావం చూపిన ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ డివైజు సాంకేతిక మరియు ఎంటర్ టైన్ మెంట్ వ్యవస్థలకు ఎంత గానో దోహదపడుతున్నాయి. మొబైల్స్ మరియు కంప్యూటర్ విడి భాగాల తయారీదారు జీనియస్ ఆపిల్ డివైజులకు ప్రత్యేక స్పీకర్లను రూపొందించింది. ఐఫోన్ స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ టాబ్లెట్ పీసీలకు ఈ స్పీకర్లు ఉపయుక్తంగా నిలుస్తాయి. వీటి వివరాలు ...

SP-i600 డాకింగ్ స్పీకర్ : ఐప్యాడ్ టాబ్లెట్ పీసీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ డాకింగ్ స్పీకర్ ఖచ్చితమైన సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పటిష్టమైన 4 వాట్ స్పీకర్లను ఈ డాకింగ్ ఆడియో సిస్టంలో నిక్షిప్తం చేశారు. రిమోట్ కంట్రోల్ ఆధారితంగా పనిచేసే ఈ స్పీకర్లు హోమ్ ధియోటర్ అనుభూతిని కలిగిస్తాయి. భారతీయ మార్కెట్లో ఈ స్పీకర్ సిస్టం ధర రూ.3500.

జీనియస్ SP-i500 స్పీకర్: ఐఫోన్ స్మార్ట్ ఫోన్ కోసం డిజైన్ చేయబడిన ఈ స్పీకర్ సిస్టం మన్నికైన ఆడియో ప్లే బ్యాక్ ను అందిస్తుంది. స్పీకర్ అవుట్ పుట్ సామర్ధ్యం 2 watts. ప్లే, పాస్, పవర్ ఇన్ క్రీస్, డిక్రీస్ ఆప్షన్లకు సంబంధించి 4 బటన్లను స్పీకర్లో ఏర్పాటు చేశారు. ఛార్జింగ్ స్టేషన్, అలారమ్ సౌలభ్యతలు శ్రోతకు మరింత లబ్ధి చేకూరుస్తాయి. భారతీయ మార్కెట్లో ఈ స్పీకర్ల ధర 6,500.

ఈ స్పీకర్ సిస్టంల విడుదల మరియు ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖచ్చితత్వంతో కూడిన మన్నికైన సౌండ్ వ్యవస్థను కోరుకునే ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు మాత్రం జీనియస్ సంస్ధ రూపొందించిన స్పీకర్ సిస్టంలు

భేషుగ్గా ఉపయోగపడతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting