పొడవైన ‘జీనియస్ స్పీకర్లు’ రూ.4779కే!!

Posted By: Staff

పొడవైన ‘జీనియస్ స్పీకర్లు’ రూ.4779కే!!


‘‘మ్యూజిక్ ప్రేమికుల గుండెల్లో నమ్మదగిన ముద్ర వేసుకున్న ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘జీనీయస్’ అత్యాధునిక SP-HF2020 డిజిటల్ ఉడెన్ టవర్ స్పీకర్లను అతితక్కువ ధర రూ.4779కే అందించనుంది. ఆడ్వాన్సడ్ కాన్ఫిగరేషన్లతో రూపుదిద్దుకున్న ఈ పొడవాటి స్పీకర్లు నాణ్యమైన సంగీతాన్ని వినసొంపైన రీతిలో శ్రోతకు అందిస్తాయి.’’

క్లుప్తంగా జీనియస్ ‘SP-HF2020’ ఫీచర్లు:

- డివీడీ ప్లేయర్లతో పాటు ఐపాడ్, ఐఫోన్‌లను యూఎస్బీ తదితర ఎక్ల్స్‌టర్నల్ పోర్టుల ఆధారితంగా స్పీకర్లకు అనుసంధానం చేసుకోవచ్చు.
- హోమ్ థియోటర్ తరహాలో పనిచేసే ఈ పొడవాటి స్పీకర్లను ‘ఎల్‌సీడీ హెచ్డీటీవికి’ అనుసంధానం చేసి నాణ్యమైన ఆడియో అనుభూతిని ఆస్వాదించవచ్చు.
- స్పీకర్లలో పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ, హై యాంప్లిట్యూడ్ మ్యూజిక్ ట్రాక్‌లను సైతం వినసొంపైన బాణీలో అందిస్తుంది.
- రిమోట్ కంట్రోల్ ఆధారితంగా స్పీకర్‌లోని వాల్యూమ్, బాస్, ప్లేబ్యాక్‌ వ్యవస్థలను నియంత్రించుకోవచ్చు.
- స్పీకర్లలో ఏర్పాటు చేసిన అధునాతన సౌండ్ ఫీచర్లు క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు రాక్ సంగీతాన్ని నాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తాయి.
- నాణ్యమైన చెక్కను ఈ స్పీకర్ల నిర్మాణంలో ఉపయోగించారు.
- సంగీత ప్రేమికులకు ఈ స్పీకర్లు మరింత లబ్ధిని చేకూరుస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot