రిసైకిల్ పదార్ధాలతో ‘హెడ్ ఫోన్’!!

Posted By: Super

రిసైకిల్ పదార్ధాలతో  ‘హెడ్ ఫోన్’!!

 

సాంకేతిక  సెక్టార్లో  వేగవంతంగా చోటుచేసుకుంటున్న పరిణామాల  నేపధ్యంలో ‘పర్యావరణ అనుకూల ఉత్పత్తుల’ను తయారుచేసేందుకు  సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. పర్యావరణ పరీరక్షణ పై దృష్టిసారించిన  ‘EOps’ సంస్థ పర్యావరణానికి  హానితెలపెట్టిన ‘నాయిస్ జీరో O+’(Noisezero O+) హెడ్ ఫోన్ ను డిజైన్ చేసింది.

రిసైకిల్ చేసిన పదార్ధాల ద్వారా ఈ ‘ఇకో ఫ్రెండ్లీ’ హెడ్ ఫోన్లను తయారు చేశారు. ఈ గ్యాడ్జెట్ నిర్మాణంలో  రీసైకిల్ చేసిన స్టెయిన్ లెస్ స్టీల్, ఆల్యూమినియమ్ పదార్థాలను వినియోగించారు. పరికరంలో నిక్షిప్తం చేసిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ హై క్వాలిటీ సౌండ్ ను విడుదల చేస్తుంది.

ఏర్పాటు చేసిన ‘ఇయర్ కప్స్’చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి.  50 mm టైటానియమ్ కోటెడ్ హై-డెఫినిషన్ డ్రైవర్ ను పొందుపరిచారు. ఐపోడ్, ఐఫోన్ పరికరాలకు ఈ హెడ్ ఫోన్లను జతచేసుకోవచ్చు. అంతిమంగా అంతరాయంలేని ఆడియోను సౌకర్యవంతంగా  శ్రోత ఆస్వాదించవచ్చు. ‘నాయిస్ జీరో  O+’ తరహాలోనే  ‘నాయిస్ జీరో i+’ హెడ్ ఫోన్లను రూపొందించేందకు ‘EOps’ సంస్థ కసరత్తులు షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు మరియు ఇతర స్పెసిఫికేషన్ అంశాలకు సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot