నీటిలోనూ మ్యూజిక్ విందు!!

Posted By: Prashanth

నీటిలోనూ మ్యూజిక్ విందు!!

 

ఫ్రెండ్స్‌తో బీచ్ పార్టీ ఏంజాయ్ చేస్తున్నారా.. వట్టి కబుర్లతో ఏంజాయ్‌మెంట్ ఏం బాగుంటుంది చెప్పండి... నీటిలో కేరింతలు కొడుతూ మ్యూజిక్ వింటుంటే ఆ హుషారే వేరు.. ఈ విధమైన సౌలభ్యతను మీకు చేరువచేస్తూ గ్రేస్ డిజిటల్ సంస్థ వాటర్‌ప్రూఫ్ మరియు షాక్ ప్రూఫ్ వ్యవస్థలతో కూడిన బూమ్ బాక్స్‌ను డిజైన్ చేసింది. ఈ మ్యూజిక్ స్పీకర్ డివైజ్ నీటిలో మునిగినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. ఏర్పాటు చేసిన సురక్షితమైన కేస్‌లో స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ పీసీని అమర్చుకోవచ్చు. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ పీసీను స్పీకర్‌కు జత చేసుకోవల్సి ఉంటుంది.

ఇకో టెర్రా బూమ్ బాక్స్‌గా రూపుదిద్దుకున్న ఈ స్పీకర్ బాక్స్ కీలక ఫీచర్లు:

* ఉత్తమ క్వాలటీ అనుభూతులతో కూడిన ఆడియోను విడుదల చేసి 3 ఇంచ్ స్పీకర్స్,

* 4 సెల్ రీఛార్జ్‌బుల్ బ్యాటరీ,

* బ్యాకప్ 25 గంటలు,

* వాటర్ ప్రూఫ్ మరియు షాక్ ప్రూఫ్,

* ధర 7,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot