‘ఐఫోన్’కోసం గ్రిఫిన్ అందిస్తున్న ప్రయాణ స్పీకర్లు!!

Posted By: Super

‘ఐఫోన్’కోసం గ్రిఫిన్ అందిస్తున్న ప్రయాణ స్పీకర్లు!!

ఆపిల్ ఆవిష్కరణకర్త దివంగత ‘స్టీవ్ జాబ్స్’ను కలకాలం గుర్తుంచుకునేలా ‘ఆపిల్’ గ్యాడ్జెట్లో దోహదపడతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఐపోడ్, ఐఫోన్ల ఆవిష్కరణలతో వినోదం మరియు సమాచార రంగంలో నూతన ఒరవడికి భీజం వేసిన దిగ్గజ స్టీవ్ జాబ్స్ నాణ్యమైన సాంకేతికతను వినయోగదారులకు చేరువ చేశారు.

ఆపిల్ గ్యాడ్జెట్లకు మరింత గుర్తింపును తెచ్చే క్రమంలో ‘గ్రిఫిన్’ మ్యూజిక్ పరికరాల సంస్థ, ఐఫోన్ సంబంధిత డాక్ స్పీకర్లను మార్కెట్లో విడుదల చేసింది. ప్రయాణ సందర్భాల్లో నాణ్యమైన సంగీతాన్ని ‘గ్రిఫిన్ ట్రావెల్ స్పీకర్ల’ ద్వారా ఆస్వాదించవచ్చు. డాక్ వ్యవస్థ ఆధారితంగా ‘ఐఫోన్’ను స్పీకర్లకు జత చేసుకోవల్సి ఉంటుంది. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో రూపొందించిబడిన ఈ స్పీకర్ల ద్వారా అంతరాయంలేని సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

బ్యాటరీల సామర్ధ్యం ద్వారా ‘గ్రీఫిన్ స్పీకర్లు’ శక్తిని సమకూర్చుకుంటాయి. స్పీకర్లలో ఏర్పాటు చేసిన ‘మినీ యూఎస్బీ పోర్టు’ద్వారా ఛార్జింగ్ ప్రక్రియ జరుగుతుంది. వాల్యుమ్ నియంత్రణ ఇతర అంశాలకు సంబంధించి బటన్లను స్పీకర్ల కుడి భాగంలో ఏర్పాటు చేశారు. గ్రిఫిన్ స్పీకర్ల మార్కెట్ ధర రూ.1500 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot