‘గీక్ స్టఫ్’ వాటర్ ప్రూఫ్ ఎంపత్రీ మ్యూజిక్ ప్లేయర్!!

Posted By: Staff

‘గీక్ స్టఫ్’ వాటర్ ప్రూఫ్ ఎంపత్రీ మ్యూజిక్ ప్లేయర్!!

బాత్రూమ్‌లో స్నానం చేస్తూ మ్యూజిక్‌ను ఏంజాయ్ చేయాలన్న తహ తహ ఎవరికుండదు చెప్పండి.., స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ సంగీత ప్రపంచంలో విహరించాలనుకునే వారు ఈ లోకంలో చాలమందే ఉన్నారు..,వీరందరి కోసమే కాబోలు జపాన్ బ్రాండ్ ‘గీక్ స్టఫ్’ వాటర్ ఫూఫ్ ఎంపీత్రీ ప్లేయర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ ప్లేయర్‌ను బాత్రూమ్, స్విమ్మింగ్ పూల్ ఇలా నీటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

మ్యూజిక్ ప్లేయర్ల అభివృద్ధిలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న జపాన్ గ్యాడ్జెట్ల సంస్థ ‘గీక్ స్టఫ్ ఫర్ యూ’ సరికొత్త వాటర్ ఫ్రూఫ్ ఎంపీత్రీ ప్లేయర్‌ను, రేడియో సౌలభ్యతతో మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ‘వాటర్ ప్రూఫ్ ప్రొటక్షన్ టెక్నాలజీని ఈ ప్లేయర్ నిర్మాణంలో ఉపయోగించారు. ప్రతిష్టాత్మక ‘IPX7’చే గుర్తింపు పొందిన ‘GS4U ఎంపీత్రీ ప్లేయర్’ ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంది.

గుండ్రటి బంతి ఆకృతిలో డిజైన్ చేయబడ్డ ఈ స్పీకర్లు యూఎస్బీ మరియు 32.జీబీ సామర్ధ్యంగల ఎస్డీ‌కార్డ్ స్లాట్‌లను కలిగి ఉంటాయి. ఈ స్లాట్‌లకు పెన్‌డ్రైవ్ తదితర కార్డులను జత చేసుకని సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఏర్పాటు చేసిన్ ఎఫ్‌ఎమ్ రేడియో వ్యవస్థ 76.0 నుంచి 108 MHz వరకు ఫ్రీక్వెన్సీ పరిధిని కలిగి ఉంటుంది.

ఎంపీత్రీ ప్లేయర్ ‘x6 AA’ పటిష్ట బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. బ్యాకప్ అంశాలను పరిశీలిస్తే ఎస్టీ కార్డు వినియోగించిన సందర్భంలో 13 గంటలు, యూఎస్బీ మెమరీని వినియోగించిన సందర్భంలో 9 గంటల, రేడియోను వినియోగించిన సమయంలో 28 గంటల బ్యాకప్ సామర్థ్యాన్నిస్తుంది. ధర అంశానికి వస్తే ‘GS4U ఎంపీత్రీ ప్లేయర్’ మార్కెట్ ధర రూ.8,300.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot