‘హ్యార్లీ డేవిడ్‌సన్’ బూమ్ బూమ్ స్పీకర్లు..!!

Posted By: Staff

‘హ్యార్లీ డేవిడ్‌సన్’ బూమ్ బూమ్ స్పీకర్లు..!!

సాధారణంగా మోటార్‌సైకిల్‌పై రైడ్ చేసేటప్పుడు స్పష్టమైన సంగీతం వినడం అసాధ్యం. ఒకవేళ వినాలనుకున్నా.. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వినాల్సిందే. అయితే, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. బైక్ రైడ్ చేస్తున్న ఇయర్‌ఫోన్ల ద్వారా సంగీతం వినడం పరధ్యానానికి గురిచేసి ప్రమాధానికి కారణమవుతుంది. మరి బైక్‌పై ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ఎలా...?

ఇలా వినూత్నంగా ఆలోచించే వారికోసమే అమెరికాకు చెందిన క్రూయిజ్ బైక్‌ల తయారీ కంపెనీ హ్యర్లీ డేవిడ్‌సన్ ఓ సరికొత్త ఆడియో సిస్టమ్‌ను విడుదల చేసింది. ఈ ఆడియో సిస్టమ్ పేరు 'బూమ్'. అన్నిరకాల హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లకు ఈ బూమ్ ఆడియో సిస్టమ్‌ను బిగించుకోవచ్చు. సాధారణంగా బైక్‌పై వెళ్లే వేగానికి స్పీకర్ల నుండి వచ్చే సౌండ్ స్పష్టంగా వినిపించదు.

అయితే, సరికొత్త హ్యార్లీ డేవిడ్‌సన్ బూమ్ ఆడియో సిస్టమ్‌లో స్పీకర్ల నుండి స్పష్టమైన శబ్ధం, రైడర్‌కు వినిపించేలా డిజైన్ చేశారు. ఈ బూమ్ ఆడియో సిస్టమ్‌లో రెండు 100వాట్ 2-ఛానెల్ ఆంప్లిఫ్లయర్స్‌తో పాటుగా రెండు 5.25 ఇంచ్ స్పీకర్లు, రెండు ట్వీటర్ పాడ్స్, రెండు మిడ్-రేంజ్ స్పీకర్స్, రెండు ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉంటాయి. ఈ ఆడియో సిస్టమ్ కోసం డీలర్ అనే సాఫ్ట్‌వేర్ అవసరమవుతుంది.

ప్రస్తుతం ఈ ఈడియో సిస్టమ్ అమెరికాలో లభ్యమవుతుంది. బూమ్ ఆడియో సిస్టమ్ ధర వింటే గుండే ఝళ్లుమనడం ఖాయం. ఒకవేళ ఇది మన దేశంలోకి విడుదలైతే దీని ధర సుమారు రూ.90,000 లకు పైగా ఉండవచ్చని అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot