రేడియో కమ్ బ్లూటూత్ వైర్‌లెస్ స్పీకర్!!

Posted By: Super

రేడియో కమ్ బ్లూటూత్ వైర్‌లెస్ స్పీకర్!!

 

పోర్టబుల్ ఎంపీత్రీ ప్లేయర్లు, స్మార్ట్ ఫోన్ మెబైళ్ల రాకతో రేడియోలకు గిరాకీ తగ్గిందనే చెప్పొచ్చు. రేడియోల పరిస్థితి మసకబారిపోతుందనకుంటున్న తరుణంలో ‘హిడెన్ రేడియో’ సంస్థ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

రేడియో అదేవిధంగా బ్లూటూత్ స్పీకర్లా పనిచేసే విధంగా ‘హిడెన్ సంస్థ’ సరి కొత్త వైర్ లెస్ ఆడియో సిస్టంను మార్కెట్లో ప్రవేశపెట్టింది. డబ్బా ఆకృతిలో డిజైన్ కాబడ్డ ఈ స్పీకర్ గ్యాడ్జెట్ మన్నికైన సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆస్ట్రేలియన్ డిజైనర్ వ్యాన్ డెన్ నైవెన్ హ్యుజెన్, అతని భాగస్వామి విటోర్ సాంటా మారియా ఈ స్పీకర్లను అత్యాధునికంగా డిజైన్ చేశారు. ఈ స్పీకర్ సిస్టం ను ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. బ్లూటూత్ ఆధారిత డివైజులకు ఈ స్పీకర్ ను అనుసంధానం చేసుకోవచ్చు. ఆపిల్ డివైజులతో పాటు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ పీసీలు అదేవిధంగా ల్యాప్ టాప్ లకు ఈ పీసీలను సౌకర్యవంతంగా అనుసంధానం చేసుకోవచ్చు.

బ్యాటరీలు ఆధారంగా ఈ స్పీకర్ వ్యవస్థను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సిస్టంలో పొందుపరిచిన శక్తివంతమైన బ్యాటరీలు 30 గంటల బ్యాకప్ సామర్ధ్యం కలగి ఉంటాయి. బ్లూటూత్ సదుపాయంలేని డివైజులకు 3.5 mm ఆడియో జాక్ ఆధారితంగా జత చేసుకోవచ్చు. ఈ స్పీకర్ సిస్టంను రేడియోలా అదేవిధంగా మ్యూజిక్ స్పీకర్లా ఉపయోగించుకోవచ్చు. అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో పాటు పటిష్టమైన బ్లూటూత్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టంలో నిక్షిప్తం చేశారు. ఇండియన్ మార్కెట్లో హిడెన్ రేడియ్ కమ్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.6,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot