‘హార్మన్ కార్డన్’, తక్కువ విద్యుత్.. ఎక్కువ సౌండ్!!

Posted By: Staff

‘హార్మన్ కార్డన్’, తక్కువ విద్యుత్.. ఎక్కువ సౌండ్!!

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘హార్మన్ కార్డన్’ సరికొత్త ‘ఐపాడ్ సిస్టమ్ MS 150’ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఏసీ, డీసీ ఆధారిత ఐపాడ్ పరికరాలతో పాటు ఐఫోన్ ప్లేయర్లకు ఈ మ్యూజిక్ వ్యవస్థను అనుసంధానం చేసుకోవచ్చు. అత్యుత్తమ ఆడియో టెక్నాలజీతో ఈ గ్యాడ్జెట్ పరికరాన్ని రూపొందించారు.

ఇన్‌బుల్ట్ సడీ ప్లేయర్ వ్యవస్థతో పాటు సబ్ ఊఫర్ వ్యవస్థ మ్యూజిక్ ఐపాడ్ సిస్టమ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎఫ్ఎమ్ ట్యూనర్ వ్యవస్థతో పాటు ఆర్‌డీఎస్ టెక్నాలజీని ఈ వ్యవస్థలో ఏర్పాటు చేశారు. శ్రోత తనకు నచ్చిన ఎఫ్ఎమ్ స్టేషన్లను స్టోర్ చేసుకోవచ్చు. 7.3 అంగుళాల ఛాసిస్ పాలిస్ బ్లాక్ కలర్ తో డిజైన్ చేయబడింది.

మ్యూజిక్ సిస్టమ్ ఫ్రీక్వెన్సి స్థాయిని పరిశీలిస్తే 65Hz నుంచి 20 KHz సామర్ధ్యం కలిగి ఉంటుంది. సిగ్నల్ నాయిస్ రేషియో 75డెసిబల్స్ ఉంటుంది. అత్యాధునిక 3s సౌండ్ వ్యవస్ధ నాణ్యమైన ఆడియో, వీడియో అవుట్‌పుట్‌లను అందిస్తుంది.

‘Ms 150’ స్పీకర్ సిస్టమ్‌లో అమర్చిన యూఎస్బీ పోర్టుల ద్వారా ‘పెన్ డ్రైవ్’లోని మ్యూజిక్ ఫైళ్లను ప్లే చేసుకోవచ్చు. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆధారిత ఆడియో ప్లేయర్లను జత చేసుకోనే సౌలభ్యాన్ని స్పీకర్ సిస్టమ్‌లో కల్పించారు.

రిమోట్ వ్యవస్ధ ఆధారితంగా ఈ మ్యూజిక్ సిస్ట్‌మ్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఆలారమ్ వ్యవస్థను మందుగానే సిస్టమ్‌లో ప్రీ లోడ్ చేశారు. తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేయ్యటంతో పాటు మన్నికైన మ్యూజిక్ అనుభూతిని శ్రోతకు అందిస్తుంది. ఆధునిక హంగులతో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇండియన్ మార్కెట్ ధర రూ.34,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot