మీ ప్రాణాలకు తన ప్రాణం అడ్డుపెడుతుంది..!!

Posted By: Super

మీ ప్రాణాలకు తన ప్రాణం అడ్డుపెడుతుంది..!!


‘‘ప్రతిష్టాత్మక ‘హనీ వెల్ లైఫ్ సేఫ్టీ సంస్థ’ (HLS) సరి కొత్త ఆవిష్కరణకు తెర లేపింది. ఇవాక్ ప్రో (EvacPro) పేరుతో సురక్షిత సంగీత పరికరాన్ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వాయిస్ అలారం వ్యవస్థ మాదిరిగా పని చేసే ఈ పరికరం అగ్ని ప్రమాద సంకేతాలను ఇట్టే పసిగడుతుంది. మీ ప్రాణాలకు తన ప్రాణం పెట్టి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది..’’

మీటింగ్‌లు, శుభకార్యాలు, హోటళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ మ్యూజిక్ పరికరాలను ఉపయోగించుకోవచ్చు. క్లాసికల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లో పిచ్‌లో అందిస్తుంది. అగ్నిప్రమాదాలను ముందుగానే పసిగట్టే ఇంజనీరింగ్ వ్యవస్థను ఈ ‘మ్యూజిక్ పరికరం’లో పొందుపరిచారు.

అగ్ని ప్రమాద సంకేతాలను ముందుగానే పసిగట్టే ఈ పరికరం హై అలర్ట్‌గా అలారంను విడుదల మోగిస్తుంది. హై సామర్ధ్యంతో విడుదలయ్యే అప్రమత్తపు గంటిక, ప్రమాదానికి చేరువులో ఉన్న వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ గ్యాడ్జెట్లను వినియోగించటం వల్ల ప్రమాదాలను ఆదిలోనే నివారించవచ్చు.

హనీవెల్ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సురక్షిత పరికరాలను రూపొందించే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంఖ్య అధికంగా ఉండే ఇండియాలో ఈ పరికరాల అవసరం ఎంతైనా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot