టీవికి ఫిట్ చేసుకునే ధియోటర్ సౌండ్ స్పీకర్లు

Posted By: Super

టీవికి ఫిట్ చేసుకునే ధియోటర్ సౌండ్ స్పీకర్లు

 

సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..?, సంగీతాన్ని స్నేహితులతో ఎంజాయ్ చేసే వారి కోసం లౌడ్ స్పీకర్లు, హోమ్ ధియోటర్ స్పీకర్స్ అందుబాటులోకి రావడం మనం చూశాం. అదే విధంగా ప్రైవసీతో కూడిన మ్యూజిక్ వినాలనుకునే వారికి ఐపోడ్స్, ఐఫోన్స్, ఎంపీత్రీ స్టిక్స్ తదితర మ్యూజిక్ హ్యాండ్ సెట్లు అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా బ్రిటీష్ ఆడియో పరికరాల తయారీదారు ‘ఫెర్గ్యుసన్’ టెలివిజన్ కు జత చేసుకునే ‘హార్న్ స్పీకర్ సిస్టం’ను రూపొందించింది. FH009 వర్షన్లో విడుదలవుతున్న ఈ 2.1 ఛానల్ ఆడియో సిస్టం రెండు హార్న్ స్పీకర్లతో డిజైన్ కాబండింది. ఈ స్పీకర్లను ఎక్కడైనా అమర్చుకోవచ్చు.

ఈ ఆడియో సిస్టమ్ ఫీచర్లు..

- ఆడియో సిస్టంలో ఏర్పాటు చేసిన సబ్ ఊఫర్ డ్యూయల్ డ్రైవర్ యూనిట్ యాంప్లీఫైర్ తో ఇంటిగ్రేట్ కాబడింది.

- సిస్టంతో జత చేయబడిన రెండు స్పీకర్లు 128W పవర్ సామర్ధ్యం కలిగి ఉంటాయి.

- RCA అనాలాగ్ ఇన్ పుట్, యూఎస్బీ పోర్టు, 3.5mm మినీ జాక్ సౌలభ్యతలను సిస్టంలో కల్పించారు. సిస్టంలో ఏర్పాటు చేసిన ‘DAC’ ఫీచర్ సౌకర్యంతో స్మార్ట్ ఫోన్, ఐపోడ్ ఇతన పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్లకు జత చేసుకోవచ్చు.

- ‘FH009’ స్పీకర్ సిస్టంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌండ్ వ్యవస్థ ఇంట్లోనే ధియోటర్ అనుభూతికి లోను చేస్తుంది.

- ఈ ఆడియో సిస్టంను యూకే నుంచి ఆర్డర్ ద్వారా కోనుగోలు చేయాల్సి ఉంది. ధర రూ.65,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot