మోగన్ స్టాండర్డ్ ఇయర్ సెట్ మైక్రోఫోన్!!

Posted By: Staff

మోగన్ స్టాండర్డ్ ఇయర్ సెట్ మైక్రోఫోన్!!

 

డిజిటెల్ కనెక్టువిటీ సొల్యూషన్స్ అభివృద్ధికి కీలకంగా దోహదపడుతున్న ‘హోసా టెక్నాలజీ’ ఆడియో పరికరాల నిర్మాణంలో అపారమైన నైపుణ్యాన్ని సంపాదించికుంది. ఈ బ్రాండ్ తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో ‘మోగన్ స్టాండర్డ్ వోమ్నీ ఇయర్ సెట్ మైక్రో ఫోన్లను’(Mogan Standard Omni earset microphones) మార్కెట్ కు పరిచయం చేసింది. అధ్యాపకులతో పాటు వ్యాపారవేత్తలు అదేవిధంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న నిపుణులకు ఈ ఆడియో గ్యాడ్జెట్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

క్లుప్తంగా ‘మోగన్ స్టాండర్డ్ వోమ్నీ ఇయర్ సెట్ మైక్రో ఫోన్ల’ ఫీచర్లు:

- హై క్వాలిటీ ఆడియో,

- మైక్రోఫోన్ వ్యవస్థలో నిక్షిప్తంచేసిన 3.0 mm omni directional capsule -45 డెసిబల్ నామినల్ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది,

- పూర్తి ఫ్రీక్వెన్సీ ఆడియో ప్రదర్శన,

- సహజంగా ప్రతిధ్వనించే సౌండ్ ఉత్పత్తి,

- చెవలకు సౌకర్యవంతంగా ఇమిడే తత్వం,

- చెవులకు సర్దుబాటు చేసుకునే విధంగా ఇయర్ కుషన్ ఏర్పాటు,

- స్టెయిన్లెస్ మెకానిజంను ఈ గ్యాడ్జెట్ నిర్మాణంలో అనసరించారు,

- పరిపుష్టి అయిన స్టెబులిటీ సామర్ధ్యం,

- విశ్వసనీయత,

- కొత్త Mogan మైక్రోఫోన్ పరస్పర మార్పిడి కేబుల్ వ్యవస్థ,

- మైక్రోఫోన్ ను అత్యంత ప్రాచుర్యం పొందిన వైర్లెస్ ట్రాన్స్మిటర్లకి అనుసంధానించవచ్చు,

- మైక్రోఫోన్ ఒక హార్డ్ వైరుడ్ కనెక్షన్ తో వేరు చేయగల, కేవ్లార్ ® రీన్ఫోర్స్డ్ కేబుల్ ను ఈ మైక్రోఫోన్ కలిగి ఉంటుంది,

- నలుపు మరియు లేత గోధుమరంగు రంగులు ఈ మైక్రోఫోన్ సిస్టంలు డిజైన్ కాబడ్డాయి,

- సింగిల్ మైక్ క్లిప్,

నిరాశకు గురి చేసే అంశం:

ఈ ఇయర్ సెట్ మైక్రో ఫోన్లను ఉన్నత ప్రమాణాలతో కంఫర్టబుల్ గా రూపొందించినప్పటికి ధర విషయంలో మాత్రం కాస్తంత గీరాకినే. రూ.11,000లకు ఈ ఇయర్ సెట్ లభ్యమవుతుంది. హై ప్రొఫైల్ బిజినెస్ క్లాస్ పీపుల్ మాత్రమే వీటిపి కోనుగోలు చేయగలరు. క్వాలిటీ కోరుకునే వారికి మాత్రం ఈ మైక్రో ఫోన్ సెట్ నూటికి నూటిపాళ్లు సంతృప్తిని కలిగిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot