హెచ్‌టీసీ వారి పోర్టబుల్ కాన్ఫిరెన్స్ స్పీకర్

Posted By: Prashanth

హెచ్‌టీసీ వారి పోర్టబుల్ కాన్ఫిరెన్స్ స్పీకర్

 

వ్యాపారవేత్తలకు మొబైల్ హ్యాండ్ సెట్లను డిజైన్ చేయటంలో మన్నికైన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌టీసీ(HTC) తాజాగా కాన్ఫిరెన్స్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. ఈ గ్యాడ్జెట్‌ను ఒక్క ఆఫీస్ అవసరాలకు మాత్రమే కాదు మ్యూజిక్ వినేందుకు అదే విధంగా వాయిస్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు దోహదపడుతుంది.

బ్లూటూత్ ఆధారితంగా పనిచేసే ఈ గుండ్రటి BS P100 స్పీకర్‌ను సులభమైన రీతిలో ఉపయోగించుకోవచ్చు. ఒకే సారి రెండు బ్లూటూత్ యాక్టివేటెడ్ డివైజులకు ఈ స్పీకర్‌ను జత చేసుకోవచ్చు. బ్లూటూత్ వ్యవస్థను ఆన్ లేదా ఆఫ్ చేసుకునేందుకు స్పీకర్లో ప్రత్యేక బటన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పటిష్టవంతమైన మెటాలిక్ పదార్ధాన్ని స్పీకర్ నిర్మాణంలో ఉపయోగించారు.

క్లుప్తంగా ఫీచర్లు:

- ధృడమైన శరీరాకృతి,

- ఆకట్టుకునే రౌండ్ షేప్ డిజైన్,

- స్పీకర్ స్టాండ్-బై టైమ్ 200 నుంచి 300 గంటలు,

- మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ 8 గంటలు,

- కాన్ఫిరెన్స్ టాక్ టైమ్ 10 గంటలు,

- సాధారణ టాక్ టైమ్ (వాయిస్ కాల్స్) 12 గంటలు,

- స్టీరియో ప్లేబ్యాక్ టైమ్ 6 గంటలు,

- అనువైన పోర్టబులటీ,

- భారతీయ మార్కెట్లో ‘HTC BS P100’ స్పీకర్ ధర రూ.6,000 (అంచనా మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot