మోటరోలా బ్లూటూత్ హెడ్ సెట్!!

Posted By: Staff

మోటరోలా బ్లూటూత్ హెడ్ సెట్!!

 

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘మోటరోలా’ 2011కు అత్యుత్తమంగా ముగింపుపలికే దిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. ‘మోటరోలా HX550’ వర్షన్‌లో అత్యాధునిక బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు పూర్తి చేసింది.

అతి తక్కువ బరువుతో రూపుదిద్దుకున్న ‘HX550’ హెడ్‌సెట్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతుంది. ఖచ్చితమైన క్లారిటీ, క్వాలిటీ , ఆడిబులిటీ వంటి అంశాలను పుష్కలంగా ఈ గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేశారు. ఈ విధమైన టెక్నాలజీ సౌలభ్యతతో వినియోగదారుడు ఏ ఒక్క ముఖ్యమైన కాల్‌ను మిస్ కాడు. శక్తివంతమైన v3.0 బ్లూటూత్ కనెక్టువిటీ వ్యవస్థను హెడ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. బ్లూటూత్ సాంధ్రత 300 అడుగులు. పొందుపరిచిన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయంలేని ఆడియోను నాణ్యమైన కోణంలో అందిస్తుంది.

మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారా గ్యాడ్జెట్ ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ హెడ్‌సెట్లో అమర్చని మన్నికైన బ్యటారీ 16 గంటల స్టాండ్ బై, 9 గంటల బ్యాకప్ సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. వినియోగదారుడు మోటో స్పీక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను లోడ్ చేసుకున్నట్లయితే తన వాయిస్ ద్వారా మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఆటోమెటిక్ వాల్యుమ్ ఎడ్జెస్ట్‌మెంట్ సౌలభ్యత. సౌకర్యవంతమైన అనుభూతినందించే ‘మోటరోలా HX550’ హెడ్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్ ధర రూ.3,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot