ఐబాల్ నుంచి మ్యూజిఫ్లాష్ మ్యూజిక్ హెడ్‌సెట్!

Posted By: Staff

ఐబాల్ నుంచి మ్యూజిఫ్లాష్ మ్యూజిక్ హెడ్‌సెట్!

 

ఉపకరణాల తయారీ విభాగంలో దేశీయంగా గుర్తింపుతెచ్చుకున్న ఐబాల్ తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని మరింత విస్తరిస్తూ  సరికొత్త  వైర్‌లెస్ మ్యూజిక్ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఈ మ్యూజిఫ్లాష్ హెడ్‌సెట్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ను ఏర్పాటు చేయటం మరో విశేషం. దీంతో అనేక పాటలను కార్డ్‌లో స్టోర్ చేసుకుని హెడ్‌సెట్‌ను మ్యూజిక్ ప్లేయర్ లా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థను హెడ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. కేబుల్ సాయంతో హెడ్‌సెట్‌ను మొబైల్ అలానే ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన బుల్ట్-ఇన్ బ్యాటరీ 10 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా హెడ్‌సెట్‌ను చార్స్ చేసుకోవల్సి ఉంటుంది. ధర రూ.1499.

జీబ్రానిక్స్ నుంచి ఇటీవల విడుదలైన బ్లూటూత్ హెడ్‌సెట్ ‘జడ్ఈబి-బిహెచ్500’ ఫీచర్లు:

తక్కువ బరువు,

బ్లూటూత్ ఫీచర్,

మోనో హ్యాండ్స్ ఫ్రీ మోడ్,

వాల్యుమ్ కంట్రోల్,

రీచార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 2.5 గంటలు, 85గంటల స్టాండ్‌బై),

బ్లూటూత్ సాంధ్రత 10 మీటర్లు,

ఒక సంవత్సరం వారంటీ,

యూఎస్బీ చార్జింగ్ కేబుల్,

ప్రముఖ ఐటీ స్టోర్‌లలో ఈ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను రూ.449కి విక్రయిస్తున్నారు.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot