ఐబాల్ యునివో@రూ.599

ఇండియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఇంకా కంప్యూటర్ ఉపకరణాల తయారీ సంస్థ ఐబాల్ తన పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో ‘ఐబాల్ యునివో' సరికొత్త హ్యాండ్స్ ఫ్రీ ఇయర్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ 599. ఈ యూనివర్శల్ హెడ్‌సెట్‌లను ఫోన్, ట్యాబ్లెట్, మ్యూజిక్ ప్లేయర్ ఇంకా ఇతర మీడియా డివైజ్‌లకు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ద్వారా కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఐబాల్ యునివో హ్యాండ్స్ ఫ్రీ ఇయర్ ఫోన్‌ల బరువు 12 గ్రాములు.
ఈ ఇయర్ ఫోన్‌ల కొనుగోలు పై రెండు ఇయర్ క్యాప్‌లను ఉచితంగా పొందవచ్చు. అత్యుత్తమ ఆడియో క్వాలిటీని చేరువచేసే ఈ హెడ్‌ఫోన్‌లు ఇన్‌లైన్ మైక్రోఫోన్, వన్ టచ్ ఆన్సర్, వన్ టచ్ ఎండ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ హెడ్‌సెట్‌లను ధరించటం ద్వారా డ్రైవింగ్ వంటి సమయాల్లో సౌకర్యవంతమైన సౌండ్ అనుభూతులను ఆస్వాదించవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








