అసలు సిసలైన ఆడియో గ్యాడ్జెట్ ‘ఐఫ్రాగ్జ్’..!!

Posted By: Super

అసలు సిసలైన ఆడియో గ్యాడ్జెట్ ‘ఐఫ్రాగ్జ్’..!!

మీరు అసలు సిసలైన ‘మ్యూజిక్ ప్రేమికులా’..?, కరుడు గట్టిన గ్యేమింగ్ లవ్వరా..?, ఇప్పడిక మీ సంతోషాలను శాస్వుతంగా పదిలపర్చుకోండి సరికొత్త ‘ఐఫ్రాగ్జ్’(iFrogz) మ్యూజిక్ గ్యాడ్జెట్లతో..

ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు ‘ఐఫ్రాగ్జ్’అధునాత మ్యూజిక్ హెడ్‌సెట్లను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఐఫ్రాగ్జ్ మెగుల్’, ‘ఐఫ్రాగ వెర్టెక్స్’ వర్షన్లలో రెండు హెడ్‌సెట్ గ్యాడ్జెట్లను ఈ హాట్ బ్రాండ్ ప్రవేశపెట్టింది.

ఈ ‘మెగుల్ వర్షన్’ హెడ్‌సెట్లో అమర్చని 3.5mm ఆడియో జాక్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఇతర బ్లాక్ బెర్రీ పరికరాలకు జత చేసుకోవచ్చు. టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే డ్రివెన్ యూనిట్ 50 mm సామర్ధ్యం కలిగి, 10-30,000 Hz ఫ్రీక్వెన్సీకి సపోర్టు చేస్తుంది. కార్డ్ లెంగ్త్ 1.5 mm.పరికరంలో ఏర్పాటు చేసిన సూపర్ - డీప్ బాస్ సౌండ్ టెక్నాలజీ శ్రోతకు వినసొంపైన ఆడియో అనుభూతిని కలిగిస్తుంది.

ఇక ‘వెర్టిక్స్ వర్షన్’ హెడ్‌సెట్ విషయానికొస్తే కొత్త అంశాలను ఈ పరికరంలో పొందుపరిచారు. వినియోగదారుడి చెవులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రోటేషనల్ హింగ్స్ వ్యవస్థను పొందుపరిచారు. ఏర్పాటు చేసిన ‘ఏరోఫోమ్ కుషన్స్’ గాలి సరఫరాకు దోహదపడుతుంది. ఇన్-లైన్ టెక్నాలజీ, ఇన్-డెప్త్ ట్యూనింగ్, మైక్రోఫోన్ తదితర ఫీచర్లు వినియోగదారుడికి ప్రయాణ సందర్భాల్లో మరింత లబ్ధి చేకూరుస్తాయి.

అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీతో పాటు, సౌకర్యవంతంగా డిజైన్ కాబడని ‘ఐఫ్రాగ్జ్’ ఆడియో గ్యాడ్జెట్ల ధరలను పరిశీలిస్తే మెగుల్ వర్షన్ రూ.3500, వెర్టిక్స్ వర్షన్ రూ.2500లకు మార్కెట్లో లభ్యమవతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot