ఇన్‌కేస్ సోనిక్ హెడ్‌ఫోన్!!

Posted By: Prashanth

ఇన్‌కేస్ సోనిక్ హెడ్‌ఫోన్!!

 

ఐఫోన్, ఐప్యాడ్ ఉపకరణాల తయారీదారు ఇన్ కేస్ (Incase) అత్యాధునిక సోనిక్ హెడ్ పోన్స్ ను ప్రవేశపెట్టింది. ఉత్తమమైన పనితీరు, దీర్ఘకాలిక మన్నిక, హై క్వాలిటీ సౌండ్ వ్యవస్థ తదితర గొప్ప అంశాలను ఈ ఆడియో గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేశారు. ఈ హెడ్‌ఫోన్స్ ఇయర్‌ కప్స్ చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అయ్యే విధంగా సాఫ్ట్ స్యూడ్ పదార్ధాన్ని వినియోగించారు. హెడ్ ఫోన్స్ నిర్మాణంలో ఉపయోగించిన యాంటీ స్క్రాచ్ మెటిరీయల్, సప్పిల్ ఫోమ్, యాంటీ స్క్రాచ్ స్టఫ్ వంటి అంశాలు వినియోగదారుడికి లగ్జరీ అనుభూతిని కలిగిస్తాయి.

క్లుప్తంగా ఫీచర్లు:

- అనవసర శబ్ధాలను తొలగించేందుకు హెడ్‌ఫోన్‌లో ‘లో - మాస్ టిటానియమ్ ఆడియో డ్రైవర్స్’ను నిక్షిప్తం చేశారు.

- రైట్ యాంగిల్డ్ ఆడియో జాక్,

- ¼ కేబుల్ ఆడాప్టర్,

- ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20-hz నుంచి 20 kHz వరకు,

- పటిష్టమైన స్క్రాచ్ రెసిస్టెంట్ వ్యవస్థ,

- SPLరేటింగ్ 103 డెసిబల్స్,

- వినసొంపైన బాస్ రెస్పాన్స్,

- ఇన్-లైన్ మైక్రోఫోన్,

- మినీ ప్లగ్,

- త్రీ బటన్ కంట్రోల్,

- అన్ని విధాలా నిపుణులచే భేష్ అనిపించుకున్న ఇన్‌కేస్ సోనిక్ హెడ్‌ఫోన్ ధర రూ.10,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot