‘ఇన్స్‌పాన్ ఇన్ఫోటెక్’ యూఎస్బీ పవర్ స్పీకర్లు...!!

Posted By: Staff

‘ఇన్స్‌పాన్ ఇన్ఫోటెక్’ యూఎస్బీ పవర్ స్పీకర్లు...!!

విఖ్యాత హార్డ్‌వేర్ పరికరాల తయారీదారు ‘ఇన్స్‌పాన్ ఇన్ఫోటెక్’ యూఎస్బీ ఆధారిత స్పీకర్లను మార్కెట్లో అతితక్కువ ధరకు విడుదల చేసింది. మన్నికైన సౌండ్ టెక్నాలజితో నిర్మించబడ్డ 4వాట్ యూఎస్బీ పవర్ స్పీకర్లను నోట్ పరికరాలతో పాటు కంప్యూటర్ పీసీలకు అనుసంధానం చేసుకోవచ్చు.

ఈ స్పీకర్లలో ఏర్పాటు చేసిన 52 mm స్పీకర్ డ్రైవర్ వ్యవస్థ నాణ్యమైన ఈక్వలైజేషన్‌తో పాటు సహజసిద్ధమైన ఆడియో అనుభూతిని శ్రోతకు అందిస్తుంది. స్పీకర్ల ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఫ్రంట్ ఫ్యానల్‌కు సీడీ ప్లేయర్, సెల్‌ఫోన్ వంటి గ్యాడ్జెట్లను జత చేసుకోవచ్చు.

సంగీతన్నా ప్రైవేటుగా వినదలుచుకున్న వారు హెడ్‌ఫోన్ జాక్‌లను స్పీకర్లకు జత చేసుకోవచ్చు. స్టైలింగ్ బ్లాక్ ఫినిష్‌తో డిజైన్ చేయబడ్డ స్పీకర్లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. 180~20 KHz సౌండ్ ఫ్రీక్వెన్సి అంతరాయంలేని ఆడియోను అందిస్తుంది.

‘జీనియస్ SP-U150’ మోడల్‌గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ స్పీకర్లను ‘ఇన్స్‌పాన్ ఇన్ఫోటెక్’ సంస్థ సంవత్సరం వారంటీతో రూ. 750కే అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot