iphone 15 సీరిస్ సూపర్ అప్‌డేట్.. ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేనట్లుగా.. !
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో iphone లపై ఉన్న క్రేజ్ వేరు. ఐఫోన్లు యాజర్లు సహా కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా ఐఫోన్‌పై అప్‌డేట్లు కోసం తెగ వెతుకుతుంటారు. ప్రస్తుతం iphone 15 ప్రో మ్యాక్స్‌పై క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
టిప్‌స్టర్ Ice Universe ఓ స్క్రీన్ ప్రొటక్టర్‌ను షేర్ చేసింది. దాంతో కొత్త ఐఫోన్ డిజైన్ ఇలా ఉంటుందంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఐస్ యూనివర్స్ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్ర్కీన్ బెజెల్ మరింత సన్నగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

iphone 14 ప్రో మ్యాక్స్ కూడా సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చింది. ఈ సన్నని బెజెల్స్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ బెజెల్స్ (2.17mm) కంటే మరింత సన్నగా ఉంటాయని సమాచారం. అలాగే షియోమి 13 (1.81) కంటే సన్నగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బెజిల్స్ అన్నింటికన్నా సన్నగా ఉండనున్నాయని Ice Universe వెల్లడించింది.
అంతేకాకుండా ఈ సన్నని బెజెల్‌తో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సూపర్ ప్యాగ్‌షిప్ ఫోన్ కానుందని తెలిపింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కూడా 14 ప్రో మ్యాక్స్ మాదిరిగానే గుండ్రటి బెజెల్స్ (Curved Bezels) కలిగి ఉంటాయని ఇటీవలే ShrimpApple వెల్లడించింది. ఇది ఆపిల్ వాచ్ లాంటి లుక్ ఇవ్వనుందని తెలిపింది.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 48MP కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంది. పెరీస్కోప్ లెన్స్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రో మోడళ్లు రెండు కూడా టైటానియం ఫ్రేమ్ కలిగి ఉండొచ్చని సమాచారం. ఈ ఫోన్లు తక్కువ వెడల్పు ఉండొచ్చు, కానీ ఐదు శాతం మందంగా ఉండనున్నాయని సమాచారం.
అయితే ఈ రెండు ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లు వాల్యూమ్, పవర్ బటన్లు ఉండవని తెలుస్తోంది. అధిక ధర, తయారీలో ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో వార్త కూడా వినిపిస్తోంది. ఒక అంగుళం కెమెరా సెన్సార్, మ్యూట్ స్విచ్, పెరిస్కోప్ లెన్స్ సహా మరిన్ని ప్రవేశపెట్టనుందని సమాచారం.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే రానుందని తెలుస్తోంది. 120 Hz రీఫ్రెష్ రేట్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. మరియు 4400mAh బ్యాటరీతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని సమాచారం. యాపిల్ A15 బయోనిక్ ప్రొసెసర్‌తో లాంచ్ కానుంది.
6GB, 128GB వేరియంట్‌తో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. నలుపు, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. భారత్‌లో ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,990 ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సీరిస్ ఫోన్లు ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








