జిమ్ చేస్తూ హ్యాండ్ ఫ్రీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయండి!!!

Posted By: Prashanth

జిమ్ చేస్తూ హ్యాండ్ ఫ్రీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయండి!!!

 

సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది.. రకరకాల సాధనాల ద్వారా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. నిపుణులైన జెర్మీ శ్యాక్సటన్, జాకబ్ మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక వైర్‌ ఫ్రీ హెడ్ ఫోన్లను రూపొందించారు. ఈ హెడ్‌ఫోన్ సెట్‌‌కు ‘ఆపిల్ ఐపోడ్ షఫుల్’ను జత చేసుకునే సౌలభ్యతను వీరు కల్పించారు. ఇక జాగింగ్, జిమ్ తదితర సందర్భాల్లో హ్యాండ్ ఫ్రీ సంగీతాన్ని సౌకర్యవంతమైన ఆస్వాదించవచ్చు.

‘ODDIO 1’ వర్షన్‌లో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ముఖ్య విశేషాలు:

*‘ఐపోడ్ షుఫుల్’ను హెడ్‌సెట్ సైడ్ భాగంలో అమర్చుకునే సౌలభ్యత, * కార్డ్ లెస్, * ఆకట్టుకునే డిజైన్, * తక్కువ బరవు, * 30 mm సామర్ధ్యం గల సౌండ్ డ్రైవర్స్, * మన్నికైన సౌండ్ క్వాలిటీ, * హై క్వాలటీ నైలాన్ ప్లాస్టిక్ పదార్ధాన్ని హెడ్‌ఫోన్ నిర్మాణంలో ఉపయోగించారు, * హెడ్‌ఫోన్ ఆన్, ఆఫ్, వ్యాల్యుమ్, మ్యూట్ వంటి అంశాలకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ, * రియాల్టీ‌గా మ్యూజిక్ విన్న అనుభూతి, * గ్రే, బ్లాక్, పింక్ రంగుల్లో ఈ హెడ్ ఫోన్ సెట్ లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot