ఇండియాలో ఆపిల్ కొత్త ఐపోడ్ ధర ఎంత..?

Posted By: Super

ఇండియాలో ఆపిల్ కొత్త ఐపోడ్ ధర ఎంత..?

 

 

ఇండియాలో త్వరలో విడుదల కానున్న కొత్త తరం ఆపిల్ ‘ఐపోడ్ టచ్’ అలాగే ‘ఐపోడ్ నానోల’ ధరల వివరాలను ఆపిల్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సరికొత్త  5వ తరం ఐపోడ్ టచ్ (32జీబి వర్షన్): రూ.23,900,

సరికొత్త  5వ తరం ఐపోడ్ టచ్ (64జీబి వర్షన్): రూ.30,900,

సరికొత్త ఐపోన్ నానో: రూ.12,500.

మరోవైపు ఆపిల్ తన 4వతరం ఐపోడ్ టచ్ ధరలను తగ్గించింది. ప్రస్తుత ధరలను పరిశీలిస్తే ...

4వ తరం ఐపోడ్ టచ్ (16జీబి వర్షన్): రూ.15,900,

4వ తరం ఐపోడ్ టచ్ (32జీబి వర్షన్): రూ.19,500,

ఐపోడ్ షుఫుల్ ఇంకా ఐపోడ్ క్లాసిక్‌లను పాత ధరలకే విక్రయిస్తున్నారు...  ఐపోడ్ షుఫుల్ ధర రూ.3,700, ఐపోడ్ క్లాసిక్ ధర రూ.19,900.

సరికొత్త ఐప్యాడ్ టచ్ ఫీచర్లు:

4 అంగళాల వెడల్పు స్ర్కీన్, రెటీనా డిస్‌ప్లే, మల్టీ-టచ్ ఐపీఎస్ టెక్నాలజీ (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), ఓలియోఫోబిక్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్,  ఆపిల్ ఏ5 చిప్‌సెట్, 5 మెగాపిక్సల్ ఐసైట్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), ఇన్-బుల్ట్ లియోన్ బ్యాటరీ (40 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 8 గంటల వీడియో ప్లేబ్యాక్).

సరికొత్త ఐపోడ్ నానో ఫీచర్లు:

2.5 అంగుళాల వెడల్పాటి స్ర్కీన్, మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), ఇన్-బుల్ట్ రీచార్జబుల్ లియోన్ బ్యాటరీ (30 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 3.5 గంటల వీడియో ప్లేబ్యాక్).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot