ప్రపంచపు నెంబర్.1 మ్యూజిక్ ప్లేయర్

Posted By: Super

ప్రపంచపు నెంబర్.1 మ్యూజిక్ ప్లేయర్

 

ఆపిల్ ఐపోడ్ టచ్ ప్రపంచపు నెంబర్ -1 మ్యూజిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ ప్లేయర్ల విభాగంలో ఆధిపత్య హోదాను అధిరోహించిన ఈ డివైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తమ క్వాలిటీ మల్టీమీడియా అనుభూతలను ఈ గ్యాడ్జెట్ చేరువచేస్తుంది. ఇంటిల్లిపాదిని వినోదాల విందులో ముంచెత్తే ఆపిల్ ఐపోడ్ టచ్ 8,32,64 జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధరలు 8జీబి వర్షన్ - 10,500,32జీబి వర్షన్ -15,600, 64జీబి వర్షన్ - 21,000.

In English

ఐపోడ్ టచ్‌లో నిక్షిప్తం కాబడిన పలు ముఖ్య పీచర్లు వాటి విశేషాలు:

ఫేస్ టైమ్: ఈ ఫీచర్ సౌలభ్యతతో వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. కాలింగ్ సందర్బంలో మీరు వ్య్తక్తం చేస్తున్న హావభావాలు అవతలి వ్యక్తులకు సంపూర్ణమైన క్లారిటీతో కనిపిస్తాయి.

హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్: ఈ డివైజ్‌లో అమర్చిన సెకండరీ కెమెరా హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియోలను చిత్రీకరించేందుకు తోడ్పడుతుంది. తక్కువ వెలుతురులో హై క్వాలిటీ వీడియోలను ఈ కెమెరా చిత్రీకరిస్తుంది.

రెటీనా డిస్‌ప్లే: ఐపోడ్ టచ్‌లో అమర్చిన రెటీనా డిస్‌ప్లే 960X640 రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో విజువల్స్‌ను ఖచ్చితమైన క్లారిటీతో వీక్షించవచ్చు.

ఎయిర్‌ప్లే: ఈ వ్యవస్థ సౌలభ్యతతో వైర్ల సాయంలేకండా ఫోటోలు, వీడియోలు తదితర అంశాలను షేర్ చేసుకోవచ్చు.

ఐక్లౌడ్: ఈ ఐక్లౌడ్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన కంటెంట్‌ను స్టోర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot