‘ఐరిస్ 9000’ 2012లో మీ ముందుకు!!

Posted By: Super

‘ఐరిస్ 9000’ 2012లో మీ ముందుకు!!

అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారా..? అయితే 2012 వరకు ఆగాల్సిందే. మీ నోటి ఆజ్ఞాపనతో ఎక్కడో దూరానున్న సదురు మనిషికి సంకేతాలు టైమ్ కు ఖచ్చితంగా చేరిపోతాయి. సందేశాల నుంచి ఈ - మెయిల్స్ వరకు మీ నోటి నుంచి వెలువడే ఒక్క కమాండ్ ద్వారా క్షణాల్లో కార్యరూపం దాల్చుతాయి.

పర్సనల్ సెక్రటరీలా పనిచేసే విధంగా ఆపిల్ ఐఫోన్ 4Sలో ‘సిరి’ వాయిస్ కమాండ్ అప్లికేషన్ ను పొందుపరిచిన విషయం తెల్సిందే. అయితే ఈ అప్లికేషన్ కు మరింత బలం చేకూర్చే విధంగా ‘ఐరిస్ 9000 వాయిస్ గ్యాడ్జెట్’ (voice accessory) రూపుదిద్దుకుంటుంది.

ఆపిల్ ‘ఐఫోన్ 4S’ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఈ అల్ట్ర్రామోడ్రెన్ గ్యాడ్జెట్ స్పీకర్ మీ పర్సనల్ సెక్రటరీలా పనులు చక్కబెడుతుంది. డాకింగ్ పక్రియ ద్వారా ‘ఐరిస్ 9000’ను ‘ఐఫోన్ 4S’కు జత చేసుకోవల్సి ఉంటుంది మైక్రో రిమోట్ ఆధారితంగా సిరి అప్లికేషన్ ను ఆన్ చేసుకోవచ్చు.

‘ఐరిస్ 9000 స్పీకర్’ 50 అడుగుల సాంధ్రతను కలిగి ఉంటుంది. గదిలో ఎక్కడైనా ఈ పరికరాన్ని సెట్ చేసుకోవచ్చు. మీ వాయిస్ కమాండ్లను ‘ఐఫోన్ 4S’కు ఎటువంటి అవాంతరాలు లేకుండా తక్షణమే చేరవేస్తుంది.

ఐరిస్ 9000 ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిస్తే ‘120-240V AC’ఆడాప్టర్ మన్నికైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన ‘LED flicker’ సిరి అప్లికేషన్ విడుదల చేసే శబ్ధాన్ని రిసీవ్ చేసుకుంటుంది.

‘2012’లో మార్కెట్లో విడుదల కాబోతున్న ‘Iris 9000’ధర రూ.3,000 ఉండోచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot