వినోదపు అంచులు చూసొస్తారు!!

By Prashanth
|
iRiver B100 MP3 Player


ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ఐరివర్ (iRiver) బీ100 పేరుతో మ్యూజిక్ ప్లేయర్‌ను డిజైన్ చేసింది. రెండు ప్యాకెజిల్లో ఈ డివైజ్ లభ్యకానుంది. ఒకటి 4జీబి, మరొకటి 8జీబి. ఈ నెల ప్రధమాంకంలో వీటిని విడుదల చేయునున్నారు. స్మార్ట్‌ఫోన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ వినోదపు అవసరాలను పూర్తి స్ధాయిలో తీరుస్తుంది. కేవలం 80 గ్రాముల బరవుండే ఈ మ్యూజిక్ హ్యాండ్‌సెట్‌లో పుస్తకాలతో పాటు పీడీఎఫ్‌లను చదువుకోవచ్చు.

బీ100లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు:

3.1 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్‌బుల్ట్ మెమరీ 4జీబి మరియు 8జీబి, మైక్రో‌ఎస్డీ విధానం ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఎస్ఆర్ఎస్ 5.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థ, అన్ని ఫార్మాట్‌లను సపోర్ట్ చేసే క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, యూజర్ ఈక్వలైజర్, ఎఫ్ఎమ్ రేడియో, వాయిస్ రికార్డింగ్, బ్యాటరీ బ్యాకప్ (మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ 36గంటలు, వీడియో ప్లేబ్యాక్ టైమ్ 8 గంటలు), ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ కనెక్టువిటీ, వాయిస్ రికార్డర్, హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్.

సంగీత ప్రియులకు ఈ సుపీరియర్ క్వాలిటీ డిజిటల్ ఆడియో ప్లేయర్ ఉత్తమమైన ఎంపిక. ఏర్పాటు చేసిన టచ్‌స్ర్కీన్ వ్యవస్థ సౌకర్యవంతమైన యూజింగ్‌కు సహకరిస్తుంది. ప్లేయర్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ప్లే/పాస్, వాల్యుమ్ కంట్రోల్ బటన్లు వేగవంతంగా స్పందిస్తాయి. మెమరీ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ మ్యూజిక్ ప్లేయర్లో మీకు నచ్చిన పాటలతో పాటు వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. నిక్షిప్తం చేసిన ఈ-పబ్ అప్లికేషన్ ద్వారా పీడీఎఫ్‌లతో పాటు ఈ-పుస్తకాలను చదువుకోవచ్చు.

ఏర్పాటు చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు అన్ని ముఖ్య ఫార్మాట్ల‌ను సపోర్ట్ చేస్తాయి. ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని శ్రోత వీటి ద్వారా ఆశించవచ్చు. మొట్టమొదటి ఈ డివైజ్‌ను జపాన్‌లో లాంఛ్ చేయునున్నారు. ధర అంశాలను పరిశీలిస్తే 4జీబి ధర రూ.7,500, 8జీబి ధర రూ.8,400.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X