కొత్త ఎయిర్‌ప్లే స్పీకర్!!

Posted By: Prashanth

కొత్త ఎయిర్‌ప్లే స్పీకర్!!

 

ఆపిల్ డివైజ్‌లకు ఆడియో పరికరాలను సమకూర్చే ఐహోమ్ సంస్థ తాజాగా iW2 మెడల్‌లో కొత్త ఎయిర్‌ప్లే స్పీకర్లను డిజైన్ చేసింది. ఏప్రిల్ నాటికి ఈ స్పీకర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర అంచనా రూ.10,000. వైర్‌లెస్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టం పొందుపరిచారు.

ముఖ్య ఫీచర్లు:

మ్యూజిక్ ప్లేబ్యాక్, యూనివర్సల్ ఏసీ ఆడాప్టర్, వై-ఫై, ఐఆర్ రిమోట్, SRS WOW HD ఆడియో ప్రాసెసింగ్, ఇతర ఆడియో సోర్సుల కొరకు aux-in jack, యూఎస్బీ పోర్టు, Reson8 స్పీకర్ ఛాంబర్స్.

ఈ ఆడియో స్పీకర్లు రన్ అవుతున్న సందర్భంలోనే ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్‌టచ్ డివైజ్‌లకు ఛార్జ్ చేసుకోవచ్చు. స్పీకర్ సిస్టంలో నిక్షిప్తం చేసిన యూఎస్బీ పోర్టు ద్వారా ఇది సాధ్యమవుతుంది.ఆపిల్ ప్లేయర్లలతో పాటు ఇతర iOS ప్లేయర్లకు కూడా ఈ స్పీకర్లు సహకరిస్తాయి. యూఎస్బీ పోర్టు ద్వారా ఈ అనుసంధాన ప్రక్రియ ఉంటుంది. ఈ స్పీకర్లలో పొందుపరిచిన మరో చెప్పుకోతగ్గ వ్యవస్థ ‘ వైర్‌లెస్ స్ట్రీమింగ్ టెక్నాలజీ’ ఈ ఫీచర్ సాయంతో ఐట్యూన్స్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి సంగీతాన్ని వైర్ల సాయం లేకుండా స్పీకర్ల ద్వారా ప్లే చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot