3డి ఆడియో ఆడాప్టర్..!!

Posted By: Prashanth

3డి ఆడియో ఆడాప్టర్..!!

 

ఆడియో గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ఎస్ఆర్ఎస్ ల్యాబ్స్ ( SRS labs) ఆధునిక టెక్నాలజితో 3డి ఆధారిత ఆడియో ఆడాప్టర్‌ను డిజైన్ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్‌ల ద్వారా సంగీతాన్ని వినే వారు ఇక పై ‘iWOW 3D’ ఆడియో ఆడాప్టర్ సౌలభ్యతతో 3డి అనుభూతితో కూడిన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న కనెక్టర్‌లా పై చిత్రంలో కనిపిస్తున్న ఆడాప్టర్‌ను గ్యాడ్జెట్ ఛార్జర్ పోర్టుకు అదే విధంగా హెడ్‌ఫోన్‌కు జత చేసుకోవల్సి ఉంటుంది. ఆడాప్టర్‌లో నిక్షిప్తం చేసిన 3డి సౌండ్ వ్యవస్థ ఆడియో

అవుట్ పుట్‌ను 3డి సరౌండ్ సౌండ్‌గా మలుచుతుంది.

‘iWOW 3D’ ఆడియో ఆడాప్టర్ మేజర్ ఫీచర్లు:

- ఉన్నతమైన అనుభూతులతో సహజసిద్ధమైన సౌండ్ ను విడుదల చేసే లక్షణం,

- హైయిర్ బాస్ తో సౌండ్ విడుదల చేసే తత్వం,

- కనెక్ట్ చేసుకోవటం చాలా సులువు,

- సౌండ్ సెట్టింగ్ లకు సంబంధించి ఫ్రీ అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంది,

- ప్రీమియమ్, బేస్ మోడల్ వేరియంట్లలో ఈ ఆడియో ఆడాప్టర్లు డిజైన్ కాబడ్డాయి,

- ఒకటి iWOW-3DHF, మరొకటి iWOW-3D,

- ఐదు వేరు వేరు రంగుల్లో ఈ ఆడాప్టర్లు లభ్యమవుతున్నాయి,

- ప్రీమియమ్ మోడల్ ఆడాప్టర్ ధర రూ.4,800లు కాగా, బేస్ మోడల్ ఆడాప్టర్ ధరలు 3,000 నుంచి 5,000 మధ్య ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot