రిమోట్‌‌కు కాదు మీ నోటికి పని చెప్పండి..!!

Posted By: Staff

రిమోట్‌‌కు కాదు మీ నోటికి పని చెప్పండి..!!

ప్రపంచ హ్యాండ్ సెట్ల తయారీ దారు ‘జబ్రా’ సరి కొత్త ఆవిష్కరణకు తెరలేపనుంది, ‘ ఫ్రీవే బ్లూటూత్ ఇన్ కార్ స్పీకర్ ఫోన్’ (Freeway Bluetooth in-car speakerphone) పేరుతో అధునాతన డివైజ్‌ను ఈ సెప్టంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వైర్‌లెస్ హ్యాండ్ సెట్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిన ఈ బ్రాండ్ మరో సారి తన ప్రతిభును చాటుకోనుంది.

సరికొత్తగా విడుదల కాబోతున్న కార్ స్పీకర్ ఫోన్ ప్రత్యేకించి సంగీత ప్రియుల కోసమే. వీరు ఒత్తిడి లేకుండా సంగీతాన్ని వింటూ కారు నడపవచ్చు. ఈ డివైజుకు సంబంధించి ఎటువంటి ఇన్స్ స్టాలేషన్ అవసరం లేదు. ఈ డివైజులో పొందుపరిచిన వాయిస్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ మీ నోటి మాట ద్వారా పనిచేస్తుంది.

ఈ సులువైన డివైజును కారులో వైజర్‌కు అమర్చి మీ మొబైల్ బ్లూటూత్‌కు అనుసంధానం చేస్తే సరిపోతుంది. మీరు ఇచ్చే కమాండ్ ఆధారంగా ఈ డివైజు పనిచేయటం మొదలుపెడుతుంది. నాణ్యమైన సౌండ్ ట్రాక్ వ్యవస్థను ఈ పరికరంలో పొందుపరిచారు. మధ్యలో ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే ఆటోమెటిక్‌గా మ్యూజిక్ ఆగిపోతుంది. కేవలం ఫోన్ వచ్చిన సందర్భంలోనే కాదు మీరు కాల్ చేసే సందర్భంలో, రిడైలింగ్ చేసే సందర్భంలో మీకు ఆటంకం కలిగించ కుండా మ్యూజిక్ దానంతటకదే ఆగిపోతంది.

మీ నోటి కమాండ్ ఆధారింతగా పని చేసే ఈ పరికారాన్ని బ్లూటూత్ ఆప్షన్ ఉన్న ఏ గ్యాడ్జెట్‌తోనైనా అనుసంధానం చేసుకోవచ్చు. ఎఫ్.ఎమ్ రేడియో వంటి అంశాలను సైతం ‘బ్లూటూత్ ఇన్ కార్ స్పీకర్ ఫోన్’ ద్వారా వినవచ్చు. ఈ సరికొత్త డివైజులో పొందుపరిచిన ఇన్‌బుల్ట్ మోషన్ సెన్సార్ వ్యవస్థ సమర్థమైన పనితీరును కలిగి ఉంటుంది. పొందుపరిచిన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది.

భారతీయ వినియోగదారులు ఈ పరికరాన్ని కోనుగోలు చేయదులుచుకుంటే భాషకు సంబంధించి వాయిస్ కమాండింగ్ సాప్ట్ వేర్ వ్యవస్థను ఇన్ స్టాల్ చేసుకోవల్సి వస్తుంది. ధర విషయానికొస్తే ఈ పరికరం రూ. 7,499 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot