డ్రైవ్ చేస్తున్నా..సౌకర్యవంతంగా ఫోన్ మాట్లాడండి..!!

Posted By: Prashanth

డ్రైవ్ చేస్తున్నా..సౌకర్యవంతంగా ఫోన్ మాట్లాడండి..!!

 

మొబైల్ ఫోన్‌లకు విడి భాగాలను సమకూర్చే ప్రముఖ సంస్థ జాబ్రా తాజాగా బ్లూటూత్ నెట్‌వర్క్ ఆధారితంగా పనిచేసే హెడ్‌సెట్‌ను డిజైన్ చేసింది. ‘జాబ్రా ఎక్సట్రీమ్ 2’గా వస్తున్న ఈ మోనో హెడ్‌సెట్ ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ఉత్తమ క్వాలిటీ ఆడియోను విడుదల చేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను ధరించటం వల్ల ప్రయాణ సందర్భాల్లో శ్రోత సౌకర్యవంతంగా కాల్ పిక్ చేయగలుగుతాడు అదే విధంగా అంతరాయంలేని మ్యూజిక్‌ను ఆస్వాదించగలుగుతాడు. ఈ ఆడియో పరికరాన్ని రెండు డివైజ్‌లకు ఒకే సారి అనుసంధానం చేసుకోవచ్చు.

హెడ్‌సెట్ ఇతర ఫీచర్లు:

* అనవసర శబ్ధాలను నియంత్రించే నాయిస్ బ్లాక్ అవుట్ 3 టెక్నాలజీ.

* హై డెఫినిషన్ వాయిస్ టెక్నాలజీ,

* చెవులకు పూర్తిస్థాయిలో ఫిట్ అయ్యే విధంగా డిజైనింగ్,

* బ్లూటూత్ A2DP టెక్నాలజీ,

* బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 10గంటలు, టాక్‌టైమ్ 5.5 గంటలు,

* ఆటోమెటిక్ వాల్యుమ్ కంట్రోల్ వ్యవస్థ,

* వాయిస్ ఆధారిత కాలర్ గుర్తింపు అప్లికేషన్,

* ఇండియన్ మార్కెట్లో ధర రూ.5,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot