తింటే ఆంధ్రా గారిలే తినాలి, వాడితే ‘జాబ్రా’ హెడ్‌సెట్లే వాడాలి!!

Posted By: Super

తింటే ఆంధ్రా గారిలే తినాలి, వాడితే ‘జాబ్రా’ హెడ్‌సెట్లే వాడాలి!!


టెక్ యుగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ప్రతి క్షణం కొత్దదనాన్ని రుచి చూపిస్తున్నాయి. సంగీత పరికరాల ప్రపంచంలో కొత్త ఒరవడిని తీసుకొస్తూ ‘జాబ్రా’ వంటి ప్రముఖ తయారీ సంస్థలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే ‘జాబ్రా’ తన సాంకేతికతకు మరింత పదును పెట్టి ‘బ్లూటూత్ ఆధారితంగా పని చేసే హెడ్‌సెట్ పెయర్లను మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు పూర్తి చేస్తోంది. బ్లూటూత్ ఆధారితంగా పని చేసే హెడ్‌సెట్లు ప్రస్తుతం మార్కెట్లో నలుపు రంగుల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అయితే ‘జాబ్రా’ విడుదల చేయుబోతున్న సరికొత్త ‘బ్లూటూత్ ఆధారిత హెడ్‌సెట్లు’ గ్లూసీ రెడ్ (glossy red), తెలుపు (white) రంగుల్లో లభ్యమవుతాయి.

క్లుప్తంగా ఫీచర్లు:

- పటిష్టమైన v2.1 బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా ‘జాబ్రా ఈసీ గో’ (Jabra Easy Go) బ్లూటూత్ హెడ్‌సెట్లు పని చేస్తాయి.
- కేవలం 8 గ్రాముల బరువు మాత్రమే ఉండే హెడ్‌సెట్లు నాణ్యమైన సౌండ్ అవుట్ పుట్‌ను వినియోగదారుడికి అందిస్తుంది.
- టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ వంటి డివైజులకు ఈ హెడ్‌సెట్లను అనుసంధానం చేసుకోవచ్చు.
- కాల్స్ రిసీవ్ చేసుకునే సందర్భంలో మ్యూజిక్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది.
- అనుసంధానం చేసిన డిజిటల్ సిగ్నల్ ప్రొసెసింగ్ సాంకేతిక వ్యవస్థ నాణ్యమైన ఆడియోను అవాంతరాలు లేకుండా అందిస్తుంది.
- సున్నితమైన చెవి భాగం పై ఎటువంటి హాని తలపెట్టకుండా జాబ్రా ఈర్గల్స్‌ను (Eargels) నాణ్యమైన రబ్బర్‌తో రూపొందించారు.
- ఛార్జింగ్ సౌలభ్యతతో ఈ బ్లూటూత్ ఆధారిత హెడ్‌ఫోన్లు పని చేస్తాయి.
- హెడ్‌సెట్లలో పొందుపరిచిన (వాయిస్ గైడెన్స్ టెక్నాలజి) కనెక్టువిటీ, బ్యాటరీ లెవల్ స్థాయిలను ఎప్పటికప్పుడు వినియోగదారుడికి చేరవేస్తుంది.
- వాయిస్ డైలింగ్ వ్యవస్థ అనుసంధానించబడిన గ్యాడ్జెట్ సామర్ధ్యాన్ని బట్టి పనిచేస్తుంది.
- ఒక సంవత్సరం వారంటీతో విడుదలవుతున్న జాబ్రా బ్లూటూత్ ఆధారిత హెడ్‌సెట్ ధర రూ.2,150 ఉంటుందుని కంపెని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot